Narappa Trailer Out: కోలీవుడ్‌లో నటుడు ధనుష్ నటించిన సినిమా అసురన్. తెలుగులో ఈసినిమా రీమేక్ నారప్పగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. విక్టరీ వెంకటేష్ నటించిన తాజా సినిమా నారప్ప(Narappa Movie)పై కరోనా ప్రభావం పడింది. మే నెలలో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప మూవీ తెరకెక్కింది. వెంకటేష్‌కు జోడీగా ప్రియమణి నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. నారప్ప సినిమా (Narappa Movie) అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. సురేష్ ప్రొడక్షన్స్ నారప్ప ట్రైలర్‌ను యూట్యూబ్ వేదికగా విడుదల చేసింది. ‘మన దగ్గిర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువు ఒక్కటి మాత్రం మన దగ్గిర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ విక్టరీ వెంకటేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. కుల వ్యవస్థ, గ్రామంలో భూవివాదాలు, హక్కుల నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన అసురన్ విజయం సాధించింది. తెలుగులో నారప్పగా విడుదలకు సిద్ధంగా ఉంది.


Also Read: Dia Mirza Welcome Baby Boy: ఓ బాబుకు జన్మనిచ్చిన నటి దియా మిర్జా, కష్టాలు పేర్కొంటూ భావోద్వేగ పోస్ట్



తమిళంలో విజయం సాధించిన అసురన్‌కు కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చే తీరుగా నారప్ప (Victory Venkatesh Narappa Movie) తెరకెక్కించినట్లు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గతంలోనే తెలిపారు. ప్రకాష్ రాజ్, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు. జులై 20న అమెజాన్ ప్రైమ్ వేదికగా నారప్ప విడుదలకు సిద్ధంగా ఉంది. కలైపులి ఎస్. థానుతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నారప్ప సినిమాను నిర్మించింది. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది.


Also Read: Venkatest లేటెస్ట్ మూవీకి కరోనా ఎఫెక్ట్, విక్టరీ వెంకటేష్ Narappa Movie


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook