GIS Amount Dedution: ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక వారి ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు కట్ అవ్వవు. దీంతో వీరి జీతం మరింత పెరుగుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈపీఎఫ్‌ఓ ప్రభుత్వ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స స్కీమ్ కోతలు నిలిపివేయనున్నట్లు చెప్పింది. దీంతో వీరి జీతాలు కూడా పెరుగుతాయి. ఇది 2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరనివారికి కూడా వర్తిస్తుందని తెలిపింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (CGEGIS) 1982 లో ప్రారంభమైంది. ఈ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి రెండు లాభాలను కల్పిస్తోంది. ఉద్యోగస్థుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ కవరేజీ, రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి చెల్లింపులు (Lumpsum) సదుపాయం కూడా కల్పిస్తోంది.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ సర్‌ప్రైజ్.. ఒకేసారి భారీగా డబ్బులు..? మోదీకి రిక్వెస్ట్..!
ఈపీఎఫ్ ప్రస్తుతం ఏం చెబుతోంది?
2024 జూన్ 21న రెండు ఆర్డర్లను ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగస్థుల నుంచి ఇకపై జీఐఎస్ కోతలు ఉండవని ఇది 2013 సెప్టెంబర్ 1 తర్వాత చేరిన వారికి వర్తిస్తుందని ప్రకటించింది. ఇప్పటి వరకు కట్ అయిన డబ్బులు కూడా తిరిగి చెల్లించనున్నట్లు తెలిపింది. దీంతో పదేళ్ల నుంచి కట్ అయిన జీఐఎస్ డబ్బులు కూడా ఉద్యోగస్థుల ఖాతాల్లో జమా కానున్నాయి. సాధారణంగా ఈపీఎఫ్‌ఓ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగల జీతాల నుంచి ప్రతి నెలా కొంత మొత్తం డబ్బులు కట్ చేస్తుంది. వాటిని భవిష్యనిధిగా కొద్దికొద్దిగా ఆదా చేస్తుంది. ఉద్యోగుల అవసరలా నిమిత్తం వాటిని తిరిగి పొందే సదుపాయం కూడా కల్పిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం, అనారోగ్య సమస్యలకు కూడా దానితీస్తుంది.
ఇదీ చదవండి: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్
అయితే, జీఐఎస్ కోతలు మాత్రం తొలగించనున్నట్లు తెలుస్తోంది.. కానీ, 2013కి ముందు చేరిన ఉద్యోగులకు ఈ పథకంలో మార్పలు వర్తిస్తాయా? లేదా? అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter