Pavitra Lokesh: నరేష్ నా పార్టనర్ మాత్రమే కాదు.. పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pavitra Lokesh Comments on Naresh: పవిత్ర లోకేష్ నరేష్ మధ్య ప్రేమ వ్యవహారం మాములు రచ్చ రేపడం లేదు. తాజాగా మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పవిత్ర లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Naresh is my support system says Pavitra Lokesh: ఈ మధ్యకాలంలో పవిత్ర లోకేష్ నరేష్ మధ్య ప్రేమ వ్యవహారం వైరలైనంత బాగా ఇంకా ఏ వ్యవహారం వైరల్ అవ్వలేదని చెప్పాలి. నిజానికి పవిత్ర లోకేష్ కు గతంలోనే వివాహం అయింది. అయితే విభేదాలతో ఆమె తన భర్త సుచేంద్ర ప్రసాద్ నుంచి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
నరేష్ కి కూడా గతంలో మూడు వివాహాలు అయ్యాయి. అందులో మొదటి భార్య మొదలు రెండో భార్యతో కూడా విడాకులు తీసుకున్నారు. కానీ మూడో భార్యతో మాత్రం విడాకులు తీసుకోలేదు. అయితే విడాకులు తీసుకోకపోయినా ఆయన ఆమెకు చాలా కాలం నుంచి దూరంగానే ఉంటున్నారు. అయితే పవిత్ర లోకేష్ నరేష్ మధ్య ప్రేమ మొదలై అది సహజీవనానికి దారితీసిందని అది ఇల్లీగల్ అని చెబుతూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పెద్ద ఎత్తున హడావిడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Music Director Raj: టాలీవుడ్లో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత
నరేష్ దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మళ్లీ పెళ్లి అనే ఒక సినిమా కూడా వీరు చేస్తున్నారు. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాని నరేష్ స్వయంగా నిర్మించాడు. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ జంట చేస్తున్న హల్చల్ ఇంతా అంతా కాదు. తాజాగా ఇదే విషయం మీద పవిత్ర లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నరేష్ తనకు పార్టనర్ మాత్రమే కాదని తన సపోర్ట్ సిస్టం అని ఆమె అన్నారు. నిజానికి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నామని కూడా ఒప్పుకోలేదు కానీ రహస్యంగా వివాహం చేసుకున్నామంటే మాత్రం ఒప్పుకోమని అంటున్నారు. నరేష్ అయితే తమ మనసులు కలిసాయని చెబుతున్నారు. ఇక ఇదే అంశం మీద పవిత్ర లోకేష్ మాట్లాడుతూ తాము చాలా కాలం క్రితమే మంచి స్నేహితులం అని ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన ఎప్పుడూ తనకు అండగానే నిలబడుతూ వచ్చారని చెప్పుకొచ్చారు. ఇక తమ రిలేషన్ గురించి జరుగుతున్న ట్రోలింగ్ తనను చాలా బాధకు గురి చేస్తుందని, ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ పేర్కొన్నారు.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook