Malli Pelli Telugu Teaser న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా.. నరేష్‌ పవిత్రలు లిప్ లాక్ చేస్తూ తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించిన విషయం ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఇది సినిమా ప్రమోషన్ అని అప్పుడు ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ అవన్నీ కూడా తమ సినిమా ప్రమోషనల్ స్టంట్స్ అని తరువాత అర్థం అయింది. మళ్లీ పెళ్లి అంటూ నరేష్‌ పవిత్రలు ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేసేస్తున్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది. ఈ టీజర్‌ను గమనిస్తే.. ఈ సినిమా నరేష్‌ పవిత్ర రమ్య రఘుపతిల కథ అని స్పష్టంగా అర్థం అవుతోంది. రమ్యా రఘుపతి పాత్రను వనిత విజయ్ కుమార్ పోషించినట్టుగా అనిపిస్తుంది. తన భర్త తనను వదిలేశాడని, వేరే వారితో ఉంటున్నాడని మీడియాతో వాపోవడం, మరో వైపు నరేష్‌ పవిత్రలు సరసాలు ఆడుకోవడం చూపించాడు. ఇక టీజర్ చివర్లో బెంగళూరు హోటల్‌లో జరిగిన సీన్‌ను దింపేశాడు డైరెక్టర్ ఎంఎస్ రాజు.


 



ఈ టీజర్ చూస్తుంటే మాత్రం ఒరిజినల్ కారెక్టర్లనే వారు పోషించినట్టుగా అనిపిస్తోంది. నరేష్, పవిత్రలు తమ నిజ జీవితంలోని పాత్రలను పోషిస్తూ.. తమకు జరిగిన ఘటనలనే సినిమాగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాను నరేష్ నిర్మిస్తుండగా.. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. డర్టీ హరి, 7 డేస్ 6 నైట్స్ అంటూ ఎం ఎస్ రాజు సందడి చేశాడు. మళ్లీ ఇప్పుడు ఇలా ట్రెండింగ్‌లో ఉన్న జంట అయిన నరేష్‌ పవిత్రలతో వారి కథే తీస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు ఎంఎస్ రాజు.


Also Read:  IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా


మరి ఈ సినిమాతో నరేష్ పవిత్రలు తమ రిలేషన్ మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? అసలు ఇది కల్పిత కథ అని చెబుతారా? లేదా తమ బయోపిక్కే అని చెబుతారా? అన్నది చూడాలి. ఈ సినిమా టీజరే ఇలా చర్చకు దారి తీస్తుంటే.. ఇక ట్రైలర్ ఎంతటి హాట్ టాపిక్ అవుతుందో.. సినిమా ఎలాంటి కాంట్రవర్సీకి దారి తీస్తుందో చూడాలి.


Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook