Naresh Pavitra Marriage Video Promotional Stunt: చాలాకాలం నుంచి నటుడు నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఒక్కసారిగా తెరమీదకు వచ్చి నటుడు నరేష్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఆయన గత కొంతకాలంగా పవిత్ర లోకేష్ తో అఫైర్ కొనసాగిస్తున్నాడని ఆరోపణ చేయడంతో ఒక్కసారిగా వీరి వ్యవహారం మీద తెలుగు మీడియా దృష్టి పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి కన్నడ మీడియాకి వెళ్లి మరి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అనేక ఆరోపణలు చేయగా దానికి నరేష్ కూడా కన్నడ మీడియా ముందుకు వెళ్లి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. డిసెంబర్ 31వ తేదీన మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కొత్త జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నామంటూ నరేష్ పవిత్ర లోకేష్ లిప్ కిస్ చేసుకున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే అదే సమయంలో తనకు ఇంకా విడాకులు ఇవ్వలేదు కాబట్టి ఈ వివాహం చెల్లదు.


బహుశా వారి వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపించరు ఇదేదో ప్రమోషనల్ స్టంట్ లాగా ఉంది అంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు ఇదే విషయం నిజమని అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే  నరేష్ పవిత్ర లోకేష్ ఒక రిలేషన్షిప్ లవ్ స్టోరీ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని టైటిల్ అలాగే సినిమా ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.


ఎంఎస్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాన్ని చెప్పేందుకు ఇలా సోషల్ మీడియాలో నరేష్ పవిత్ర పెళ్లి అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారని ఈరోజు విడుదల చేసిన వీడియో కూడా అందులో భాగం అయి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ వార్త విన్న నెటిజన్లు మాత్రం నరేష్ మనందరినీ భలే బకరా చేస్తున్నాడు రా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నరేష్ ఇప్పటికే రెండు వివాహాలు విఫలమవుగా మూడో భార్యతో కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ విడాకులు తీసుకున్న తర్వాత పవిత్ర లోకేష్ తో నిజంగా వివాహం చేసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి జరిగిన వీడియో అంతా సినిమాలో భాగమేనని త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారని అంటున్నారు.


Also Read: Actor Naresh Marriage: నరేష్-పవిత్రల పెళ్లి వీడియో.. పవిత్ర బంధం అంటూ నటుడి ట్వీట్.. అసలు విషయం ఇదా!


Also Read: Actor Naresh Wedding Photos: పవిత్ర మెడలో నరేష్ మూడు ముళ్లు.. దుబాయ్ లో హనీమూన్.. ఫోటోలు వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి