Allu Arjun Rejected Movies List: పుష్ప సినిమాలో యాక్టింగ్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. పుష్ప-2 మూవీ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. పగడ్బందీగా మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే జాబితాలో చేరిన అల్లు అర్జున్.. తన కెరీర్‌లో కొన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారు. కారణం ఏదైనా.. బన్నీ రిజెక్ట్ చేసిన తరువాత ఆ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జున్ రెడ్డి


విజయ్ దేవరకొండను టాప్ హీరోగా నిలబెట్టిన సినిమా అర్జున్ రెడ్డి. అయితే ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మొదట అల్లు అర్జున్‌ను సంప్రదించినట్లు సమాచారం. కారణం ఏంటో తెలియదు గానీ బన్నీ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఆ తరువాత విజయ్ దేవరకొండ చేయడం.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేయడం జరిగాయి. ఈ మూవీతోనే రౌడీ స్టార్‌గా విజయ్ దేవరకొండ ఎదిగాడు. 


భద్ర


మాస్ మహారాజా రవితేజ-బోయపాటి శ్రీను కాంబో వచ్చిన మూవీ భద్ర. మీరా జాస్మిన్, మురళీ కృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫ్యాక్షన్ కమ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు ముందుగా అల్లు అర్జున్‌ను హీరోగా అనుకున్నా.. ఆ తరువాత కుదరలేదు. 


100% లవ్


నాగచైతన్య, తమన్నా హీరోహీరోయిన్స్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 100% లవ్. 2011లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ముందుగా ఈ కథను సుకుమార్ ముందు బన్నీకే వినిపించినట్లు తెలిసింది. రొమాంటిక్ పాత్రలు పోషించడానికి అల్లు అర్జున్ ఆసక్తి చూపలేదని.. ఆ తర్వాత సినిమా అక్కినేని నాగ చైతన్య వద్దకు వెళ్లిందని తెలిసింది.


గీతా గోవిందం


విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జంటగా నటించిన మూవీ గీతా గోవిందం. పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీని ముందుగా అల్లు అర్జున్‌కు వినిపించగా.. ఆ పాత్రకు తాను సరిపోనని రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో తీయగా.. బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. విజయ్ దేవరకొండ-రష్మిక కెమెస్ట్రీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది.


లైగర్


డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన మూవీ లైగర్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. మూవీ విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనగా.. ఆ అంచనాలను అందులేకపోయింది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించగా.. రమ్య కృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ స్టోరీకి పూరి జగన్నాధ్ మొదటగా అల్లు అర్జున్‌కు కథ చెప్పినట్లు తెలిసింది. అనివార్య కారణాల వల్ల బన్నీ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు.


Also Read: IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం..


Also Read: Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook