Rashmika Mandanna Exercise Video: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ నుండి నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. రష్మిక నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వటంతో కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. రష్మిక ఫిట్ గా ఉండేందుకు జిమ్ లో తెగ వ్యాయామాలు చేస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానులకు దగ్గరగా ఉంటానికి ఎప్పటికపుడు అప్డేడ్ లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మన రష్మిక.. ఇంకేం ఉంది అది క్షణాల్లో వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రష్మిక మందన్న భాషతో సంబంధం లేకుండా ఉత్తర, దక్షణ సినీ ఇండస్ట్రీ సినిమాలలో  నటిస్తూ బిజీగా ఉంటుంది. అగ్రిమెంట్ చేసిన సినిమాల కోసం చాలా కష్టపడుతుంది ఈ ముద్దుగుమ్మ. అటు సినిమాల గురించి.. ఇటు తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. రష్మిక జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేసింది. కాళ్లతో వెయిట్ లిఫ్ట్ చేస్తూ.. లెగ్ వర్కౌట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 


సాధారణంగా హీరోయిన్లు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. అందంతో పాటు ఫిట్ గా కూడా ఉండటం ముఖ్యం. గ్లామర్ తో కొంత కాలం మాత్రమే నెట్టుకొని రాగలరు . అందుకోసమే  రష్మిక మందన్న ఫిజికల్ ఫిట్ గా కనిపించటానికి రోజులో కొంత సమయం జిమ్ లో గడుపుతూ ఉంటారు. రష్మిక తన అందంతో పాటు.. ఫిట్నెస్ లో కూడా హీరోలకు సరి సమానంగా శ్రమిస్తోంది. అటు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంటున్న రష్మికను ఇటు జిమ్ లోను కష్టపడం చూస్తున్న ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. 


Also Read: Whatsapp Video Call: చిరు వ్యాపారికి వలపు వల.. తియ్యని మాటలతో నగ్నంగా మార్చి..!  




ఇప్పటి వరకు రష్మిక గ్లామర్ మరియు మంచి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ రష్మిక మందన్నను ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో చూడాలని తన ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు.  ఇక ప్రస్తుతం రష్మిక నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా రూపొందుతున్న పుష్ప- 2 లోను.. రెయిన్ బో సినిమాలో కూడా నటిస్తుంది. అంతేకాదండోయ్.. బాలీవుడ్ సూపర్ స్టార్ రన్బీర్ కపూర్ నటిస్తున్న  ‘యానిమల్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ "సందీప్ రెడ్డి వంగ" దర్శకత్వం వహిస్తున్నారు. 


Also Read:  రూ. 600 కోట్లకు చేరువలో 'జవాన్​'.. ఆరో రోజు ఎంత వసూలు చేసిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook