Whatsapp Video Call: చిరు వ్యాపారికి వలపు వల.. తియ్యని మాటలతో నగ్నంగా మార్చి..!

Hyderabad Honey Trap Case: ఫేస్‌బుక్‌లో ఓ యువతితో ఏర్పడిన పరిచయం హైదరాబాద్‌ చిరు వ్యాపారి నిండా ముంచింది. యువతి మాటలకు కరిగిపోయి వాట్సాప్‌లో న్యూడ్ వీడియో కాల్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. రూ.లక్షన్నర డబ్బులు పొగొట్టుకున్నాడు. వేధింపులు తాళలేక సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 01:46 PM IST
Whatsapp Video Call: చిరు వ్యాపారికి వలపు వల.. తియ్యని మాటలతో నగ్నంగా మార్చి..!

Hyderabad Honey Trap Case: అతను ఒక చిరు వ్యాపారి. ఫోన్‌లో ఫేస్ బుక్ చూస్తూ ఉండగా.. ఓ అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అవతల అమ్మాయి కదా అనే మరో ఆలోచన లేకుండా వెంటనే యాక్సెప్ట్ చేశాడు. చాటింగ్‌లో ఫోన్‌ నంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్‌కు చేరుకుంది వలపు ప్రయాణం. నిత్యం కాల్స్, చాటింగ్‌లో వలపువయ్యారాలు విసిరిన మాయ లేడీ..వ నగ్నంగా వీడియో కాల్ చేయమని కోరింది. ఇంకేముంది అబ్బో అనుకున్నాడు మనోడు. ఎంచక్కా ఊహల్లో తెలుతూ న్యూడ్ కాల్స్ మాట్లాడాడు. కాల్ కట్ అయిన తరువాత గానీ అసలు సీన్ అర్థం కాలేదు. మనోడి న్యూడ్ వీడియోలను చూపించి.. బెదిరింపులకు పాల్పడి లక్షన్నర వసూలు చేసింది కీలేడీ. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన వివరాలు మేరకు.. హైదరాబాద్‌ నగారికి చెందిన చిరు వ్యాపారి (32) ఫేస్‌బుక్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. చాటింగ్‌లో ఫోన్ నంబర్లు మార్చేసుకున్నారు. ఇద్దరు రోజూ గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకునేవారు. తియ్యని మాటలతో వల విసిరిన యువతి.. నగ్నంగా మారి వీడియో కాల్ చేయమని కోరింది. ఆ యువతి ఆ మాటలకు కరిగిపోయిన వ్యాపారి.. రోజు మాట్లాతున్న అమ్మాయే కదా అని చెప్పినట్లే చేశాడు.

ఇక అంతే.. వ్యాపారి అడ్డంగా దొరికిపోయాడు. న్యూడ్‌ వీడియోను రికార్డు చేసిన యువతి.. డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టింది. మొదట్లో కొంత చెల్లించగా.. ఇంకా ఇవ్వాలని బెదిరించింది. లేకపోతే న్యూడ్‌ వీడియో ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌ అందరికీ ట్యాగ్ చేసి పెడతానని హెచ్చరించింది. దీంతో విడతల వారీగా రూ.లక్షన్నర యువతికి పంపించాడు. అయినా ఆమె బెదిరింపులు ఆగలేదు. చివరికి వేధింపులు తాళలేక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం మొత్తం చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి గుర్తు తెలియని వాళ్లతో పరిచయాలు పెంచుకోవద్దని.. వీడియో కాల్స్, ఓటీపీలు అస్సలు షేర్ చేసుకోవద్దని పోలీసులు సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  

Also Read: Nipah Virus Latest Updates: ముంచుకొస్తున్న నిపా వైరస్ ముప్పు.. మరో ఇద్దరు మృతి.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News