Nani Returns Remuneration: శ్యామ్ సింగరాయ్కు భారీ నష్టాలు.. రెమ్యునరేషన్ తిరిగిచ్చిన నాని
Nani Returns Remuneration : నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ మూవీపై ఏపీలో సినిమా టికెట్ రేట్స్ ప్ర్రభావం చూపాయి.. దీంతో సరిగా కలెక్షన్స్ రాలేదు. అయితే ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లికి నాని అండగా నిలిచి.. ఏం చేశాడో తెలుసా?
Natural star Nani Returns Remuneration producer For Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ శ్యామ్ సింగరాయ్. (Shyam Singha Roy) క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 రిలీజైంది ఈ మూవీ. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కొంత నష్టం కూడా వచ్చిందని సమాచారం.
మూవీలో నాని, సాయి పల్లవిల యాక్టింగ్ అదుర్స్ అనే టాక్ వచ్చింది. నాని శ్యామ్ సింగరాయ్ మూవీకి ముందు వీ, టక్ జగదీశ్ (tuck jagadish) మూవీల్లో నటించారు. ఆ రెండు చిత్రాలు కూడా ఓటీటీలో (OTT) రిలీజ్ అయ్యాయి. దీంతో శ్యామ్ సింగరాయ్ మూవీని సినిమా థియేటర్స్‌లలో రిలీజ్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయి అలాగే రిలీజ్ చేశాడు. ఈ మూవీతో పక్కా హిట్ కొడతా అనుకున్నాడు నాని.
శ్యామ్ సింగరాయ్ మూవీ (Shyam Singha Roy Movie) రిలీజ్‌కు ముందు పలు ఆటంకాలు ఎదురైనా కూడా ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లికి అండగా నిలిచాడు అట నాని. ప్రొడ్యూసర్‌కు బలంగా నిలిచి ఆయన్ని ముందుకు నడిపించాడట.
అయితే శ్యామ్ సింగరాయ్ నైజాం డిస్ట్రిబ్యూషన్ వెనుక నిర్మాత దిల్ రాజ్ (Producer Dil Raj) నిలిచాడట. తెలంగాణ ఈ మూవీ మంచి వసూళ్లు వచ్చేలా కృషి చేశాడట దిల్ రాజ్. అలా తెలంగాణలో మంచి కలెక్షన్స్ సాధించి పెట్టింది శ్యామ్ సింగరాయ్. కానీ ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మాత్రం శ్యామ్ సింగరాయ్ మూవీ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయిందట. ఏపీలో సినిమా టికెట్ రేట్లు (Movie ticket rates) తక్కువ కావడం, అలా పలు సమస్యలు శ్యామ్ సింగరాయ్ మూవీపై ప్రభావం చూపాయి. దీంతో సరిగా కలెక్షన్స్ రాలేదట.
ఇక శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్‌కు ముందు ఏపీలో సినిమా టికెట్ రేట్స్‌పై (Cinema Ticket Rates) నాని చేసిన కామెంట్స్ కూడా దుమారం రేపాయి. ఆ ప్రభావం కూడా ఏపీలో సినిమాపై పడిందని తెలుస్తోంది. దీంతో ప్రొడ్యూసర్‌కు (Producer) కొంత నష్టం వాటిల్లిందని సమాచారం.
Also Read : JP Nadda Rally: హైదరాబాద్ లో హైటెన్షన్.. శంషాబాద్ చేరుకున్న బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా
అయితే నాని తాను తీసుకున్న రెమ్యునరేషన్‌లో కొంత మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేశాడట. మొత్తానికి నాని శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) విషయంలో మొదటి నుంచి ఒక స్టాండ్ తీసుకుని ముందుకెళ్లాడు. మూవీ బాధ్యతలన్నింటినీ తన భుజాలపై వేసుకుని ప్రమోషన్స్ నిర్వహించాడు. చివరకు రెమ్యునరేషన్‌లో (Remuneration) కొంత వెనక్కి ఇచ్చి ఆదర్శంగా నిలిచాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : Dangerous Snake Video: భయంకరమైన వీడియో- యువతిని పదేపదే కాటు వేసిన సర్పం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి