JP Nadda Rally: హైదరాబాద్ లో హైటెన్షన్.. శంషాబాద్ చేరుకున్న బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా

JP Nadda Rally: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా శంషాబాద్ చేరుకున్న నడ్డాకు పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 05:48 PM IST
JP Nadda Rally: హైదరాబాద్ లో హైటెన్షన్.. శంషాబాద్ చేరుకున్న బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా

JP Nadda Rally: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆపార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేతలు లక్ష్మణ్, రాజాసింగ్, విజయశాంతి, బంగారు శృతి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. 

నడ్డా పర్యటన సందర్భంగా శంషాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించగా.. అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. 

దీంతో జేపీ నడ్డాను కలిసి ర్యాలీకి వెళ్లొద్దని కోరేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాలీకి అనుమతి లేదని జేపీ నడ్డాకు విమానశ్రయంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. 

క్యాండిల్ ర్యాలీతో నిరసన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ.. ఆ పార్టీ ముఖ్య నేతలు క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు. 

Also Read: Telangana Yellow Alert: తెలంగాణలో వణికిస్తున్న చలిగాలులు- హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్!

Also Read: Complaint on Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో ప్రాణహాని.. హెచ్ఆర్సీలో టీఆర్‌‌ఎస్‌ నేత ఫిర్యాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News