Love Mouli Heroine: లిప్‌లాక్‌తో తన లవర్‌ను పరిచయం చేసిన నవదీప్!
Love Mouli Heroine Reveal: లవ్ మౌళి మూవీ హీరోయిన్న్ రివీల్ చేస్తూ రిలీజైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నవదీప్‌తో తన లవర్‌కు లిప్ లాక్ ఇస్తూ అందరికీ పరిచయం చేశాడు.
Navdeep Heroine Reveal Video: హీరో నవదీప్ చాలా రోజుల తర్వాత నటిస్తోన్న మూవీ లవ్ మౌళి. అవనీంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన నవదీప్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గుబురు గడ్డంతో ట్రావెలర్‌గా అదిరిపోయే లుక్‌లో కనిపించాడు నవదీప్. ఈ లుక్ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.
ఇక తాజాగా లవ్ మౌళి సినిమా హీరోయిన్ రివీల్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇక ఈ వీడియోలో నవదీప్ తన లవర్‌ను పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక ఈ వీడియోలో పంఖురి గిద్వానీని లవ్ మౌళి హీరోయిన్‌గా పరిచయం చేశారు. వీడియోలో నవదీప్‌తో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో అందంగా కనిపించింది పంఖురి.
ఉంగరాల జుట్టుతో డిఫెరెంట్ లుక్‌తో ఆకట్టుకునేలా ఉంది ఈ భామ. ఇక స్పెషల్ వీడియోలో చివరగా.. మౌళి.. చిత్రకు లిప్‌లాక్ ఇచ్చే సీన్ ఉంది. మొత్తానికి నవదీప్ తన లవర్‌కు లిప్‌లాక్ ఇస్తూ పరిచయం చేశాడంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గోవింద్ వసంత ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. తాటికొండ ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.
Also Read: Balayya Love Tips: అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చెయ్యాలో చెప్పిన బాలయ్య!
Also Read: Anchor Anasuya Eye Winking: కుర్రకారుకు కన్నుకొట్టిన యాంకర్ అనసూయ- ఫొటోలు వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook