Khiladi Movie Liplock: హీరోలతో లిప్ లాక్ చేసేందుకు నాకు నో ప్రాబ్లమ్: 'ఖిలాడి' హీరోయిన్

Khiladi Movie Liplock: ఇటీవల విడుదలైన 'ఖిలాడి' మూవీ ట్రైలర్ లోని లిప్ లాక్ పై ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ట్రైలర్ లో హీరో రవితేజ, హీరోయిన్ మీనాక్షి చౌదరికి మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. అయితే దీనిపై స్పందించిన సదరు నటి.. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 10:24 AM IST
    • హీరోతో లిప్ లాక్ పై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందన
    • లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు ఇబ్బంది లేదని వ్యాఖ్య
    • కమర్షియల్ సినిమాల్లో అలాంటి సీన్స్ సహజమని వెల్లడి
Khiladi Movie Liplock: హీరోలతో లిప్ లాక్ చేసేందుకు నాకు నో ప్రాబ్లమ్: 'ఖిలాడి' హీరోయిన్

Khiladi Movie Liplock: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఖిలాడి'. ఇందులో రవితేజ సరసన ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటించారు. ఫిబ్రవరి 11న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. 

ఈ క్రమంలో ఇటీవలే సినిమా ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి.. హీరో రవితేజకు లిప్ లాక్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అదే విషయంపై మీనాక్షి చౌదరి క్లారిటీ ఇచ్చింది. లిప్ లాక్ సీన్స్ లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. 

"రవితేజ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించేందుకు అవకాశం వచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా అంగీకరించాను. నా రెండో సినిమాగా ఇంత గొప్ప ప్రాజెక్టు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర గురించి పెద్దగా పట్టించుకోలేదు. దర్శకుడు రమేష్ వర్మ నాకు కథ చెప్పినప్పుడు లిప్ లాక్ సన్నివేశాల గురించి చెప్పారు. ఇలాంటి కమర్షియల్ సినిమాలో ముద్దు సన్నివేశాలు భాగమని నాకు అర్థమైంది. అయితే ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు" అని హీరోయిన్ మీనాక్షి చౌదరి వెల్లడించింది. 

మరోవైపు 'గద్దలకొండ గణేష్' చిత్రంలో ఐటెంసాంగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డింపుల్ హయాతి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సాంగ్ హిట్టైన తర్వాత తనకు అనేక సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని ఆమె తెలిపింది. ఈ సినిమాలో తాను లెన్తీ రోల్ పోషించినట్లు డింపుల్ హయాతి చెప్పుకొచ్చింది. అయితే సినిమాలోని ఓ పాట కోసం తాను 6 కిలోల బరువు తగ్గినట్లు ఆమె వెల్లడించింది.  

Also Read: Keerthy Suresh Photos: రెడ్ అనార్కలీలో మెరిసిపోతున్న 'మహానటి'

Also Read: Lip Lock Scenes: యంగ్ హీరోయిన్స్‌తో లిప్‌ లాక్‌లతో సీనియర్ హీరోలు.. మొన్న నాని.. ఈ రోజు రవితేజ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News