`కష్టపడ్డా, యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేశా , ఇప్పుడు అనుష్క తో సినిమా చేశా`: వైరల్ అవుతున్న నవీన్ పోలిశెట్టి డైలాగ్
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టిని ఇమిటేట్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Miss Shetty Mr Polishetty Promotions: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రేజ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన నవీన్ పోలిశెట్టి .. జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తనదైన శైలిలో ప్రేక్షకుల మన్నన పొందాడు.
అయితే నవీన్ పోలిశెట్టి తన క్రేజ్‌ని ఏ మాత్రం తగ్గించుకోకుండా మరో సారి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో చెఫ్ పాత్రలో హీరోయిన్‌గా అనుష్క నటించబోతోంది. ఇప్పటికే చిత్ర బృదం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులనకు కూడా ప్రారంభించింది.
నవీన్ పోలిశెట్టి, అనుష్క కాంబో లో వస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రీసెంట్‌గా నవీన్ పోలిశెట్టి "లేడి లక్' అనే పాటను రిలీస్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే..ఈ పాటకు మంచి ప్రజాధారణ లభించింది. అయితే ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిజీగా ఉన్నారు. ఇటీవలే హీరో నవీన్ మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ప్రమోషన్స్‌లో భాగంగా మంత్రి మల్లారెడ్డిని ఇమిటేడ్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
అంతేకాకుండా నవీన్ పొలిశెట్టి, మంత్రి మల్లారెడ్డి అన్న డైలాగ్‌లో మార్పులు చేర్పులు చేసి..'కష్టపడ్డా, యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసా, ఇప్పుడు అనుష్క తో సినిమా చేశా'అని తన దైన శైలిలో ఇమిటేడ్ చేశాడు. మల్లారెడ్డి స్టైల్ లో చెప్పగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా కేకలు వేశారు.
Also Read: Aadhaar Card, PAN Card Linking: ఆధార్, పాన్ లింక్ చేయని వారికి ఎదురయ్యే సమస్యలు
అంతేకాకుండా అక్కడ తన లేడీ ఫ్యాన్స్‌తో కూడా చిందులు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నివేశాలు నెట్టింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ సినిమాని మహేష్ బాబు .పి దర్శకత్వంలో, ప్రభాస్ హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఆగష్టు 4 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.
Also Read: Flipkart Big Saving Days 2023: ఊహించని డిస్కౌంట్లు, 79 వేల ఐఫోన్ 13 కేవలం 20 వేలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook