Nayanthara Not Attending Audio Functions : నయనతారకు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ప్రమోషన్స్‌కు రాదన్న సంగతి తెలిసిందే. నయనతార తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మాత్రమే కంప్లీట్ చేస్తుంది. వెళ్తుంది. ఎక్స్ ట్రా డేట్స్ కూడా అడ్జస్ట్ చేసేందుకు ఇష్టపడదు. అలాంటి నయనతార ఇప్పుడు కనెక్ట్ సినిమా కోసం బయటకు వచ్చింది. కనెక్ట్ సినిమాలో తన భర్త విఘ్నేశ్ శివన్ కూడా పెట్టుబడి పెట్టడంతోనే ఇలా ప్రమోషన్స్ కోసం వచ్చిందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నయన్ తాజాగా తెలుగు హీరోల మీద స్పందించింది. ఎన్టీఆర్ గొప్ప డ్యాన్సర్ అని, రిహార్సల్స్ చేయకుండా డ్యాన్స్ చేసే ఏకైక హీరో అతనే అని పొగిడేసింది. రవితేజ తనకు మంచి ఫ్రెండ్ అని, సెట్స్‌లో ఎంతో సరదాగా ఉండేవాడు అని తెలిపింది. ఇక ప్రభాస్ అయితే చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తాడని, మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిదంటూ నయన్ చెప్పుకొచ్చింది.


తాను సినిమా ప్రమోషన్స్ కోసం ఎందుకు బయటకు రాదో చెప్పేసింది. ఆడియో ఫంక్షన్లకు ఎందుకు అటెండ్ కాదో చెప్పేసింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనకు కొన్ని కలలుండేవని, మహిళా ప్రాధాన్యత చిత్రాలు ఎక్కువ లేవని, అసలు సినిమాల్లో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని నయన్ చెప్పుకొచ్చింది. అలా ఎందుకు జరుగుతుందని ఆశ్చర్యం వేసేదట. ఒక వేళ తాము సినిమా ఫంక్షన్లకు, ఆడియో ఈవెంట్లకు వచ్చినా కూడా ఏదో మూలకు నిల్చోబెడతారట. అందుకే ఈవెంట్లకు రావడమే మానేసిందట.


ఇండస్ట్రీలో పురుషులతో సమానంగా స్త్రీలను చూడాలని కనీసం తమకు ప్రాధాన్యతను అయినా ఇవ్వాలని నయన్ కోరుకుంటుందట. చూస్తుంటే నయన్ బాధ కూడా కరెక్టే అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు హీరోయిన్లకు కూడా తగిన ప్రాధాన్యత దక్కుతుంది. హీరోయిన్ కోసం రాసే పాత్రల్లోనూ ఎన్నో మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు సమంత, పూజా హెగ్డే, రష్మిక ఇలా ఎంతో మంది స్టార్డంను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.


Also Read : Laththi Telugu Movie Review : విశాల్ లాఠీ రివ్యూ.. రొటీన్ రొడ్డకొట్టుడు కొట్టిన లాఠీ  


Also Read : Hyper Aadi Shraddha Das : శ్రద్దాదాస్‌తో హైపర్ ఆది సరసాలు.. అత్తారింటికి దారేది టైపులో అర్ధగంట కావాలంట


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook