Hyper Aadi Shraddha Das : శ్రద్దాదాస్‌తో హైపర్ ఆది సరసాలు.. అత్తారింటికి దారేది టైపులో అర్ధగంట కావాలంట

Dhee 15 Championship Battle Latest Promo హైపర్ ఆది తాజాగా ఢీ షోలో తన కామెడీతో అందరినీ నవ్వించేశాడు. ఈ మేకు రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది, శ్రద్దా దాస్‌ల ట్రాక్ బాగానే నవ్వించేసింది. ఇక జెస్సీ సైతం కామెడీతో ఆకట్టుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 01:54 PM IST
  • బుల్లితెరపై హైపర్ ఆది సందడి
  • శ్రద్దా దాస్‌తో ఆది పులిహోర
  • జెస్సీపై హైపర్ ఆది కౌంటర్లు
Hyper Aadi Shraddha Das : శ్రద్దాదాస్‌తో హైపర్ ఆది సరసాలు.. అత్తారింటికి దారేది టైపులో అర్ధగంట కావాలంట

Dhee 15 Championship Battle Latest Promo బుల్లితెరపై హైపర్ ఆదికి తిరుగులేదు. ఆది పంచ్‌లకు కౌంటర్లు వేసే వారు చాలా తక్కువ. ఇక ఇప్పుడు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు అంటే అందరికీ ఆదినే గుర్తుకు వస్తాడు. ఇటు శ్రీదేవీ డ్రామా కంపెనీ, అటు ఢీ షోలను చేస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో జబర్దస్త్ షోకు వస్తున్నాడు.. వెళ్తున్నాడు. అయితే అతను చేసే షోల్లో జడ్జ్‌లతో యాంకర్లతో పులిహోర కలిపేస్తుంటాడు హైపర్ ఆది. ఢీ షోలో అయితే వచ్చిన ప్రతీ జడ్జ్‌తో ట్రాక్ కలిపేందుకు ఆది ప్రయత్నిస్తుంటాడు.

జబర్దస్త్ షోలో అప్పుడు అనసూయతో ఇప్పుడు యాంకర్ సౌమ్యతో ఆది ట్రాక్ నడిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇక జబర్దస్త్ డైరెక్షన్ టీం ఆదితోనే ఇలాంటి ట్రాకులను ఎక్కువగా ప్లాన్ చేస్తుంటుంది. ఢీ షోకు అయితే ఆదియే స్క్రిప్ట్ రైటర్. అందుకే అంతా కూడా ఆది కేంద్రంగానే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రదీప్ మీద అయినా, కో యాంకర్ల మీద అయినా, టీం లీడర్ల మీద అయినా, చివరకు జడ్జ్‌ల మీద అయినా ఆది పంచ్‌లు వేస్తుంటాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News