Nayanathara and Vignesh shivan donats rupees 20 lakhs to cm relief fund: కేరళలోని వయానాడ్ లో దారుణ విపత్తు చోటు చేసుకుంది. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు టూరిస్టులతో అందంగా ఉన్న ప్రదేశం ఒక్కసారిగా శవాల దిబ్బలా మారిపోయింది. చూస్తుండగానే.. కొండ చరియలు విరిగి పడిపోయారు. అంతేకాకుండా.. వరద నీళ్ల ప్రవాహాం వల్ల ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. వందల మంది గల్లంతయ్యారు. అనేక మంది బురద నీళ్లలో కూరుకుపోయారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటన దేశంలో సంచలనంగా మారింది. రాష్టవిపత్తు దళం, కేంద్రం విపత్తు అధికారులు సంయుక్తంగా సహాయ చర్యలు చేపట్టారు. బురదలో చిక్కుకున్న వాళ్లను కాపాడే ప్రయత్నాలుచేపట్టారు. ఎటు చూసిన శవాలు కన్పిస్తున్నాయి. అయిన కూడా అనేక మంది అధికారులు కాపాడారు. ఇళ్లన్ని పూర్తిగా నెలమట్టమయ్యాయి. అక్కడున్న వాతావరణం కాస్త, భయానకంగా మారిపోయింది.


జాగీలాలతో ఎవరైన బతికి ఉన్నారో..అని అధికారులు వెతుకుతున్నారు.ఈ నేపథ్యంలో వయానాడ్ బాధితులకు తమ వంతుగా సహాయం చేయడానికి మలళయాళం మూవీ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. నయన తార దంపతులు వయానాడ్ బాధితులకు సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు 20 లక్షలరూపాయలను విరాళంగా ఇచ్చారు.


Read more: Manu bhaker Coach: మను బాకర్ కోచ్ కు బిగ్ షాక్... పారిస్ నుంచి హుటా హుటీన భారత్ కు.. అసలేం జరిగిందంటే..?


అదే విధంగా లక్కీ భాస్కర్ టీమ్ రూ. 5 లక్షల రూపాయలు, హీరో సూర్య సతీమణి జ్యోతిక,సోదరుడి కార్తి సంయుక్తంగా రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కార్ సల్మాన్ లు రూ. 35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ. 25 లక్షలు, విక్రమ్.. రూ. 20 లక్షలు, రష్మిక మందన్న..రూ 10 లక్షలు విరాళంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈఘటనపై అన్ని వర్గాల ప్రజలు, రాజకీయా నాయకులు, సినిమా రంగం వంటి అందరు ప్రముఖులు కూడా తమ సానుభూతి తెలియజేస్తున్నారు. 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter