Nayanthara Birthday Gift: ఇటీవల కోలీవుడ్ అగ్ర కథానాయిక నయనతార తన 39వ పుట్టిన రోజును జరుపుకుంది. నవంబరు 18న నయన్(Nayanthara Birthday) తన భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో పాటు క‌వ‌ల త‌న‌యులు ఉయిర్‌, ఉల‌గ్‌ల‌తో క‌లిసి తన బర్త్ డే ను సెలెబ్రేట్ చేసుకుంది. అంతేకాకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. ఈ ఫిక్స్ కాస్త వైరల్ అయ్యాయి. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భార్య నయనతార బర్త్ డేకు విఘ్నేష్ శివ‌న్ కాస్ట్ లీ కారును గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్‌ మేబ్యాక్ కారును ఆమెకు కానుకగా ఇచ్చాడట విష్నేుష్. ఈ కారు ధర ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ కారు రేటు దాదాపు మూడు కోట్ల న‌ల‌భై ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుందని సమాచారం. విఘ్నేష్ శివ‌న్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది నయనతార. అంతేకాకుండా తన భర్త ఇచ్చిన స్వీటెస్ట్ గిఫ్ట్  అంటూ రాసుకొచ్చింది. తాజాగా ఈ ఫోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 


Also Read: Vijay-Rashmika: మళ్లీ దొరికిపోయిన విజయ్-రష్మిక.. ఇక పెళ్లి ప్రకటనే..!


ఈ సంవత్సరం జవాన్ సినిమాతో ఘనంగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నయనతార. షారుఖ్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఏకంగా ఈ మూవీ 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ బ్యూటీ నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి. నీలేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీ రేపు అంటే డిసెంబరు 1న ఆడియెన్స్ ముందుకు రానుంది. 


Also Read: BB 7 Telugu: ఓటింగ్‌లో దూసుకుపోతున్న రైతు బిడ్డ.. డేంజర్ జోన్ లో బెస్ట్ ఫ్రెండ్స్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook