Vignesh Shivan on Surrogacy: సరోగసీ కామెంట్లపై స్పందించిన విగ్నేష్ శివన్.. అప్పటివరకు ఓపిక పట్టండి అంటూ కామెంట్?
Nayanthara Husband Vignesh Shivan Indirectly Responds on Surrogacy Comments: నయనతార భర్త విగ్నేష్ శివన్ సరోగసీ అంటూ వస్తున్న కామెంట్లపై పరోక్షంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Nayanthara Husband Vignesh Shivan Indirectly Responds on Surrogacy Comments: నయనతార విగ్నేష్ శివన్ దంపతులు ఇటీవల కవల పిల్లలకు తల్లిదండ్రులై మంచి ఆనందంలో ఉన్నారు. అయితే వీరి ఆనందం ఎంతో కాలం నిలవకుండానే అసలు సరోగసి ద్వారా పిల్లలను కనడం ఏమిటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వర్షం అయితే ఇద్దరి మీద కురుస్తోంది.. ఇప్పటివరకు ఈ జంట తాము సరోగసి ద్వారా పిల్లలకు కన్నామన్న విషయాన్ని కూడా నేరుగా ప్రకటించలేదు కానీ పెళ్లయిన నాలుగు నెలల లోపే పిల్లల్ని కనడంతో వీరు సరోగసి ద్వారానే పిల్లల్ని కని ఉంటారని ఉద్దేశంతో పలువురు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
భారతదేశంలో సరోగసి ద్వారా పిల్లల్ని కనడం లీగల్ గా చెల్లదు. కాబట్టి ఏదో మతలబు ఉందంటూ పలువురు వారికి ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ విషయం మీద సీరియస్ అయింది. తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయం మీద నయనతార దంపతులను వివరణ కోరుతామని కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ విషయం మీద చాలామంది స్పందించారు కానీ నయనతార కానీ విగ్నేష్ శివన్ గాని స్పందించలేదు.
తాజాగా విగ్నేష్ శివన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ విషయం మీద పరోక్షంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని విషయాలు సరైన సమయంలోనే మీకు తెలుస్తాయి అప్పటివరకు ఓపిక పట్టండి అంటూ ఆయన తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసినట్లు చెబుతున్నారు. అంతేకాక ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి అంటూ అందులో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. తమిళ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాత్రమే ఆయన ఇలా కామెంట్ చేసి ఉంటాడని అంటున్నారు.
సరైన సమయంలోనే మీకు అన్ని విషయాలు చెబుతామని అలాగే గతంలో తాము చేసిన మేలు మరిచిపోయి ఇప్పుడు తమ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ నయనతార భర్త ఇప్పుడు మీడియా వారిని టార్గెట్ చేశారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కేవలం దీన్ని కూడా కొందరు తమిళ మీడియా ప్రతినిధులకు అన్వయిస్తున్నారు కానీ నిజంగానే ఆయన పరోక్షంగా స్పందించారా లేదా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.
[[{"fid":"248276","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also Read: Telugu Movies Releasing this week: ఓటీటీలో, థియేటర్లో రిలీజవుతున్న తెలుగు సినిమాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook