Telugu Movies Releasing this week: ఓటీటీలో, థియేటర్లో రిలీజవుతున్న తెలుగు సినిమాలివే!

Telugu Movies and Web series releasing in theatres and OTT this week:  ఈవారం ఓటీటీలో అలాగే థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీసులు ఏమిటి? అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం. ​

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 12, 2022, 04:24 PM IST
Telugu Movies Releasing this week: ఓటీటీలో, థియేటర్లో రిలీజవుతున్న తెలుగు సినిమాలివే!

Telugu Movies and Web series releasing this week in theatres and OTT: ఈవారం ఓటీటీలో అలాగే థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు ఏమేమిటి? అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం పదండి. ఈ వరం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాల విషయానికి వస్తే ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న క్రేజీ ఫెలో అనే సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదల కాబోతోంది. ఫణి కృష్ణ సిరికి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో దిగంగన సూర్యవంశీ, మిర్నామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక బాయ్ ఫ్రెండ్ ఫర్ హయిర్ అనే సినిమా కూడా అక్టోబర్ 14వ తేదీ విడుదలవుతోంది.

విశ్వంత్ మాళవికా సతీషన్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను డైరెక్టర్ కంభంపాటి డైరెక్ట్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కేజిఎఫ్ హీరో యష్ ఎప్పుడో హీరోగా నటించిన సంతు- స్ట్రైట్ ఫార్వర్డ్ అనే కన్నడ సినిమాని తెలుగులో రారాజు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యష్ భార్య రాధికా పండిట్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని 14వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇక కన్నడ సినిమా కాంతార కూడా  తెలుగులో కూడా విడుదలవుతుంది.

సెప్టెంబర్ 30వ తేదీన కన్నడలో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు కలెక్ట్ చేయగా దాన్ని తెలుగు సహా హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. వివి వినాయక్ శిష్యుడు విశ్వా డైరెక్ట్ చేసిన గీత అనే సినిమా తెలుగులో అక్టోబర్ 14వ తేదీని విడుదలవుతోంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఓటీటీ రిలీజ్ ల విషయానికి వస్తే హిందీ సిరీస్ మిస్ మ్యాచ్డ్ సీజన్ 2 అక్టోబర్ 14వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది.

దోబార అనే హిందీ సినిమా కూడా అక్టోబర్ 15వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఇక ఆహాలో నేను మీకు బాగా కావాల్సిన వాడిని అక్టోబర్ 13వ తేదీన స్ట్రీమ్ కాబోతోంది. అలాగే నందమూరి బాలకృష్ణ ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 అక్టోబర్ 14వ తేదీన స్ట్రీమ్ కాబోతోంది. ఇక విందు తానేందుతాడు కాదు అనే తమిళ సినిమా అక్టోబర్ 13వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది. అలాగే గుడ్ బ్యాడ్ గర్ల్ అనే ఒక సిరీస్ కూడా సోనీ లివ్ లో అక్టోబర్ 14వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఇవి కాకుండా ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 13వ తేదీన స్ట్రీమ్ కానుంది. 

Also Read: Godfather First Week Collections: రియాలిటీకి దూరంగా ప్రచారం.. దారుణంగా కలెక్షన్లు.. హిట్ కొట్టాలంటే అంత రావలసిందే!

Also Read: Garikipati Narasimha Rao Clarity: చిరంజీవికి గరికిపాటి క్షమాపణలు చెప్పలేదా.. ఆ పోస్టుకు అర్థమేంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x