Nayanthara demands Rs 10 crores Remuneration per a movie after marriage: 2005లో వచ్చిన 'అయ్యా' సినిమాతో నయనతార కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తొలి సినిమానే భారీ సక్సెస్‌ కావడంతో.. గజిని, చంద్రముఖి లాంటి హిట్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ రెండు సినిమాలు తెలుగులో కూడా భారీ సక్సెస్ కొట్టడంతో.. తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. నాగార్జున, రవితేజ, ప్రభాస్, వెంకటేష్, ఎన్టీఆర్, బాలకృష్ణ, గోపీచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించి తెలుగులో పెద్ద స్టార్ అయ్యారు. మరోవైపు తమిళ స్టార్ హీరోలతో జతకట్టి దక్షిణాదిలోనే అగ్ర హీరోయిన్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుస విజయాలతో నయనతారకు కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే నిజ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడిన నయన్.. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ సమయంలో చాలా డిప్రెషన్‌కు గురయ్యారు. ఇక మీ సినీ కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో 'రాజారాణి' సినిమాతో మళ్లీ గాడిలో పడ్డారు. ఓ వైపు గ్లామర్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి సూపర్ స్టార్ అయ్యారు. 


'నానూ రౌడీదాన్‌' సినిమా షూటింగ్‌ సమయంలో డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌తో లవ్‌లో పడ్డ నయనతార.. 6-7 ఏళ్లుగా కెరీర్ ఉత్తమ దశలో ఉన్నారు. ఇన్నాళ్లు పీకల్లోతు ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేశ్‌ ఇటీవల వివాహం చేసుకున్నారు. విఘ్నేష్‌ శివన్‌తో పెళ్లి తరువాత నయన్ సినీ కెరీర్‌ పడిపోతుందని చాలామంది భావించారు. అయితే అలాంటి వారి ఆలోచనలను చిత్తూ చేస్తూ కెరీర్‌ పరంగా మరింత దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ్ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్‌కు వెళ్లారు నయన్. 


స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ షారూఖ్‌ ఖాన్‌ నటిస్తున్న 'జవాన్' చిత్రంలో నయనతార హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా నయన్ బాలీవుడ్‌ భవిష్యత్తును నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం హిట్ అయితే ఆమె అక్కడ కూడా సత్తాచాటే అవకాశం ఉంది. ఇక త‌న 75వ సినిమాకు  తాజాగాగా నయన్ ప‌చ్చ‌జెండా ఊపారు. 'లేడీ సూపర్ స్టార్ 75' అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమా మొదలయింది. తాజా సమాచారం ప్రకారం నయనతార మరోసారి పారితోషికం పెంచారట. ఇప్పటి వరకు 5-6 కోట్లు పారితోషికం తీసుకుంటున్న నయన్.. ఇప్పుడు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అంటే నయన్ తన పారితోషికాన్ని డబుల్ చేశారు. 


Also Read: నిర్మాత బన్నీ వాసుకు తృటిలో తప్పిన ప్రమాదం.. గర్భిణీ స్త్రీని కాపాడబోయి..!


Also Read: వార్తా సంస్థల కంటెంట్‌ను ఉపయోగించుకోలంటే.. టెక్ సంస్థలు పేమెంట్ చెల్లించాల్సిందే!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook