Media Revenue: వార్తా సంస్థల కంటెంట్‌ను ఉపయోగించుకోలంటే.. టెక్ సంస్థలు పేమెంట్ చెల్లించాల్సిందే!

News organizations to get revenue form Big Techs. వార్తా సంస్థల కోసం భారత ప్ర‌భుత్వం త్వరలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతోంది. ఇకపై న్యూస్ ప‌బ్లిష‌ర్ల‌తో టెక్ సంస్థలు ఆదాయాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 18, 2022, 12:38 PM IST
  • బిగ్ టెక్ కంపెనీలకు ఝలక్
  • వార్తా సంస్థల కంటెంట్‌ను ఉపయోగించుకోలంటే
  • పేమెంట్ చెల్లించాల్సిందే
Media Revenue: వార్తా సంస్థల కంటెంట్‌ను ఉపయోగించుకోలంటే.. టెక్ సంస్థలు పేమెంట్ చెల్లించాల్సిందే!

News organizations to get revenue form Big Techs Soon: డిజిట‌ల్ న్యూస్ ప‌బ్లిష‌ర్స్, వార్తా సంస్థల కోసం భారత ప్ర‌భుత్వం త్వరలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతోంది. ఇకపై న్యూస్ ప‌బ్లిష‌ర్ల‌తో టెక్ సంస్థలు తమ ఆదాయాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశంలో ఐటీ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేయాలని కేంద్ర ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది. చాలా కాలంగా చర్చలు జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్‌కి చేరుకుంది. ప్రజాస్వామ్యం వృద్ధి చెందాలంటే.. సత్యం, ఖచ్చితత్వం మరియు సత్యమేవ జయతేకు మారుపేరైన భారతీయ వార్తా సంస్థలను ఆర్థికంగా మెరుగుపర్చడం కోసం ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది.

భారత్‌లోని వార్తా సంస్థ, డిజిటల్ న్యూస్ ప‌బ్లిష‌ర్ల కంటెంట్‌ను పలు సోష‌ల్ మీడియా దిగ్గ‌జాలు ఉపయోగించుకుంటున్నాయి. దాంతో ప్రకటనల ఆదాయాలతో పాటు వ్యూయర్స్ సంఖ్యను కూడా భారీగా పొందుతున్నాయి. అయితే కంటెంట్ సృష్టిస్తున్న వార్తా పత్రికలు, డిజిటల్ వార్తా ప్రచురణ కర్తలకు బిగ్ టెక్ కంపెనీలు న్యాయ బద్ధంగా చెల్లించాల్సిన వాటాను ఇవ్వడం లేదు. అందుకే వార్తా సంస్థలకు మేలు చేకూర్చేలా భారత ప్ర‌భుత్వం  కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన సవరణలను చేయాలని భావిస్తోంది. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మీడియా సంస్థల కోసంఈ  ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. 

ఇప్పటికే ఆస్ట్రేలియా, యూరప్ ఫ్రాన్స్ , స్పెయిన్‌తో దేశాల్లో డిజిటల్ న్యూస్ పబ్లిషర్లకు గూగుల్, ఫేస్ బుక్ దిగ్గజాలు తమ ఆదాయంలో వాటాను ఇస్తున్నాయి. అదే తరహాలో భారత్‌లోనూ న్యూస్ పబ్లిషర్లకు ఆదాయంలో వాటాను చెల్లించేలా ప్రభుత్వం కొత్త సవరణ చట్టాన్ని తీసుకురానుంది. అదే జరిగితే గూగుల్‌, అమెజాన్, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి పెద్ద కంపెనీలు న్యూస్ ప‌బ్లిష‌ర్ల‌తో తమ వాటాను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ విషయంను ముందుగా డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్, ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ లేవనెత్తాయి. గూగుల్‌కు వ్యతిరేకంగా ఫెయిర్‌ ప్లే వాచ్‌డాగ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఆశ్రయించాయి. న్యూస్ పబ్లిషర్లపై అన్యాయంగా షరతులను విధిస్తున్నాయంటూ ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలపై గూగుల్‌పై సీసీఐ విచారణకు ఆదేశించింది. డిజిటల్ ఫార్మాట్‌లో న్యూస్ పబ్లిషర్లు అందించే వారి కంటెంట్‌కు తగిన మొత్తాన్ని చెల్లించడం లేదని ఐన్ఎస్ కూడా తమ ఫిర్యాదులో పేర్కొంది .
 

Also Read: Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారు తేనె, వెల్లుల్లి మిశ్రమంతో వారం రోజుల్లో బరువు తగ్గొచ్చు..!

Also Read: Covid Cases: నిన్నటికంటే తగ్గిన కొవిడ్ కేసులు.. పెరిగిన మరణాలు! కొత్తగా ఎన్ని వచ్చాయంటే...

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News