Yash Toxic: యశ్ సినిమా నుండి తప్పుకున్న కరీనాకపూర్.. ఆమె స్థానంలో సౌత్ సూపర్ స్టార్..
Kareena Kapoor Out from Yash Toxic: ఫిమేల్ డైరెక్టర్ గీతూమోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్. కరీనాకపూర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కానీ తాజాగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. చిత్ర బృందం ఇప్పుడు ఆమె స్థానంలో.. మరొక ప్యాన్ ఇండియన్ నటి ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Nayanthara in Yash movie : కేజిఎఫ్ సినిమాతో.. ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నారు కన్నడ స్టార్ యష్. ప్రస్తుతం యశ్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించేందుకు.. బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ని రంగంలోకి దింపింది చిత్ర బృందం .
అయితే తాజా సమాచారం ప్రకారం చిత్రయూనిట్ కి పెద్ద షాక్ ఇస్తూ కరీనాకపూర్ ఈ సినిమా నుంచి వాక్ ఔట్ చేసిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాలో కరీనాకపూర్ యశ్ సోదరి పాత్రలో కనిపించాల్సింది. ఇద్దర్నీ వెండితెర పై చూడడానికి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ చిత్ర బృందం తో పాటు ఫాన్స్ కి కూడా పెద్ద షాక్ ఇస్తూ.. కరీనాకపూర్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. కరీనా కపూర్ స్థానంలో ఇప్పుడు నయనతారని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే చిత్ర డైరెక్టర్ గీతు మోహన్ దాస్ నయనతారకి ఈ కథని, తన పాత్రను వినిపించినట్లు వినిపించారట. నయనతార కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలాగా ఉందని వినికిడి.
హీరో సోదరి పాత్ర అయినప్పటికీ అది ఒక స్ట్రాంగ్ అమ్మాయి పాత్ర అని, నటనకి స్కోప్ కూడా ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అందుకే కరీనాకపూర్ తర్వాత మరొక ప్యాన్ ఇండియా హీరోయిన్ కోసం వెతికిన చిత్ర బృందం.. నయనతారను సంప్రదించిందట. కథతో పాటు పాత్ర కూడా బాగా నచ్చడంతో నయనతార కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
మరోవైపు కరీనా కపూర్ డేట్లు కుదరకపోవడం వల్లే ఈ సినిమా నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. వేరే సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న కరీనా కపూర్ యష్ సినిమా కోసం సమయం కేటాయించలేక.. చిత్ర బృందంతో చర్చించి సినిమా నుంచి వెనకడుగువేశారట.
ఫెయిరీ టేల్ ఫర్ ది గ్రోన్ ఆప్స్ అనే ఆసక్తికరమైన టాగ్ లైన్ తో ఈ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల కి సిద్ధం అవుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
Also read: Uttam kumarreddy: బీఆర్ఎస్ పని ఖతం.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook