NBK 109- Balakrishna: నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. అంతకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'అఖండ' మూవీతో 
బ్యాక్ బౌన్స్ అయ్యారు. అంతేకాదు సీనియర్ టాప్ హీరోల్లో ఈ రేంజ్ హిట్స్ అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఖండ 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాల్లో బాలయ్య తన ఏజ్‌కు తగ్గ పాత్రల్లో నటించాడు. ఇక భగవంత్ కేసరి విషయానికొస్తే..  ఈ మూవీలో బాలయ్య ఎలాంటి డ్యూయట్ లేకుండా తన ఏజ్‌కు తగ్గ పాత్రలో రాణించాడు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌లలో తనదైన ముద్ర వేసారు. అనిల్ రావిపూడి మొత్తంగా బాలయ్యకు తగ్గ స్టోరీని రెడీ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల మెచ్చేలా తెరకెక్కించాడు. 


'భగవంత్ కేసరి' మూవీతో బాలయ్య రికార్డులను బద్దులు కొట్టాడు. సీనియర్ హీరోల్లో వరుసగా ఎవరు మూడు రూ. 100 కోట్ల గ్రాస్.. రూ. 70 కోట్ల షేర్ అందుకున్న హీరో ఎవరు లేరు. తన తరం హీరోల్లో ఈ రికార్డు అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా నిలిచారు. ముఖ్యంగా బాలయ్య గెటప్, మాస్ అప్పీరియన్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 72 కోట్ల షేర్.. రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా ఇరగదీస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు బాలయ్య చెప్పిన డైలాగులపై నార్త్ ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. 


బాలయ్య.. ప్రస్తుతం బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టేనర్‌ చేస్తున్నారు. ఈ మూవీలో మరోసారి బాలయ్య డాన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. మరోసారి ఇందులో డ్యూయల్ రోల్లో నటించి బోతున్నట్టు సమాచారం. ఇందులో బాలయ్య  సరసన ఊర్వశి రౌతెలా నటిస్తోంది. తమన్నా ఐటెం సాంగ్ చేస్తున్నట్టు సమాచారం. బాబీ దేవోల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను జూలై 19 లేదా జూలై 26వ తేదిల్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరి ఆ తేదిల్లోనే ఈ సినిమాను విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook