NBK 109: బాలయ్య కోసం ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని రెండు డిఫరెంట్ టైటిల్స్.. ?
NBK 109- Balakrishna: నందమూరి నాయకుడు బాలయ్య తన సినీ కెరీర్లో ఎపుడు లేనంత ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత త్వరలో బాబీ సినిమాతో పలకరించబోతున్నాడు. తాజగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్.
NBK 109- Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ లాస్ట్ ఇయర్ గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్నారు. అంతకు ముందు ఠవరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'అఖండ' చిత్రంతో మంచి సక్సెస్ అందుకొని హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యారు. అంతేకాదు సీనియర్ టాప్ హీరోల్లో ఈ రేంజ్ లో హాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసారు. అఖండ 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాల్లో బాలయ్య తన ఏజ్‌కు తగ్గ పాత్రల్లో నటించాడు. ఇక భగవంత్ కేసరి విషయానికొస్తే.. ఈ మూవీలో బాలయ్య ఎలాంటి యుగళ గీతం లేకుండా తన వయసుకు తగ్గ పాత్రలో మెప్పించాడు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌లలో తనదైన లెవల్లో రాణించారు. అనిల్ రావిపూడి మొత్తంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గ స్టోరీని రెడీ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల మెచ్చేలా తెరకెక్కించి మెప్పించాడు.
'భగవంత్ కేసరి' మూవీతో బాలయ్య ఖాతాలో పలు రికార్డులు నమోదు చేసారు. సీనియర్ హీరోల్లో వరుసగా ఎవరు మూడు రూ. 100 కోట్ల గ్రాస్.. రూ. 70 కోట్ల షేర్ అందుకున్న హీరో ఎవరు లేరు. తన జనరేషన్ హీరోల్లో ఈ రికార్డు అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా నిలిచారు. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నాడు. NBK 109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అది కూడా జనవరి 12న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.
దీపావళి రోజున ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు ‘సర్కార్ సీతారామ్’, డాకూ మహారాజ్’ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండిటిలో ఏది ఫిక్స్ చేస్తారనేది చూడాలి. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమాపై ఉన్న డౌట్స్ అన్ని తీరిపోతాయి. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కు బాలయ్యే డబ్బింగ్ చెప్పునున్నారట. గతంలో ‘శ్రీరామరాజ్యం’, ‘భగవంత్ కేసరి’ సినిమాలకు హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇపుడు అదే రూట్లో ఎన్‌బీకే సినిమాకు కూడా తనే ఓన్ డబ్బింగ్ చెప్పనున్నారట. బాలయ్య 109వ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్రలో ఊర్వశి రౌతెలా నటిస్తోంది. బాబీ దేవోల్ ఈ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేస్తున్నాడు.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter