NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..
NBK@50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై బాలయ్య గురించి తమ మనుసులోని మాటలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
NBK@50Years: బాలకృష్ణ సినీ నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరగని రీతిలో ఆయన్ని సత్కరించింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. బాలయ్య 50 యేళ్ల వేడుకలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది బాలయ్యకు మాత్రమే కాదు.. మొత్తం తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలో చూస్తున్నాను. నటుడిగా అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాల కృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం ఆషామాషీ విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు.
ఇక నేను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఆదర్శం కూడా బాలయ్య నటించిన ‘సమర సింహా రెడ్డి’ ప్రేరణగా నిలిచింది. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. అందరం కలిసి డ్యాన్స్ కూడా వేస్తాము. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనరీ ఇస్తూ 100 ఏళ్లు ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సినీ రంగంలోనే కాకుండా.. రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంత ఒక కుటుంబం. ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలో అని కోరుకుంటున్నాను లాంగ్ లివ్ బాలయ్య అని చిరంజీవి ముగించారు.
మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. భారత దేశంలో నలుమూలల నుండి వచ్చిన అభిమానులకు శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం. చిన్నతనం నుండి నటుడిగా విభిన్నమైన, విశిష్టమైన నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు బాలయ్య. 500 రోజులకు పైగా ఒక సినిమా ఆడటం అనే ఘనత బాలయ్యదే. 3 సార్లు హిందూపూర్ ఎంఎల్ఏగా ఎన్నికవడం చాల ఆనందకరం. మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ముగించారు.
కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ: బాలయ్య, మేము ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం. ఆయనకు నేను తమ్ముడు లాంటి వాడిని. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించడం మరిచిపోలేనది. మేము చెన్నైలో ఉన్నప్పటి కలిసి ఉండేవాళ్ళము. మీరు ఇలాగే 100 సంవత్సరాలు వేడుకలు ఘనంగా చేసుకోవాలి.
వెంకటేష్ మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ గారి కుటుంబం నుండి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మా బాలయ్య బాబు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. మీ 50 సంవత్సరాల సినీ ప్రయాణం కొత్త వస్తున్న ఎంతో మంది ప్రేరణగా నిలుస్తుందన్నారు. 'ఫ్లూట్ జింక ముందు కాదు, సింహం ముందు కాదు అని ముగించడం విశేషం.
అటు సూపర్ స్టార్ రజినీకాంత్ బాలయ్యను ట్విట్టర్ వేదికగా అభినందించారు. అటు కమల్ హాసన్ ఫోన్ సందేశం ఇస్తూ.. అందరినీ గుర్తు పెట్టుకునే సంస్కారం బాలయ్య సొంతం. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు. స్వేచ్ఛా ఉండే తత్వం బాలయ్యకు సొంతం. ఆయన నిండు నూరేళ్లు ఆయు: ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.