NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!
NBK@50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. కానీ వేడుకకు ఆ ఇద్దరు మాత్రం హాజరు అవుతారా లేదా అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
NBK@50Years: తెలుగు సినీ పరిశ్రమలో అన్న నందమూరి తారక రామారావు సినీ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఈ నెల 29తో 50 యేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈయన గోల్డెన్ జూబ్లీ నట ప్రస్థానాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 1న సినీ పరిశ్రమ తరుపున బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన పెద్ద నటీనటులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్టు సమాచారం. మరోవైపు నందమూరి ఫ్యామిలీలో మూడో తరంలో హీరోలుగా దూసుకుపోతున్న బాలయ్య అన్న హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్ జూనియర్ తో పాటు, కళ్యాణ్ రామ్ లకు మాత్రం ఆహ్వానం అందలేనట్టు సమాచారం. మరోవైపు బాలయ్య కూడా కావాలనే వీళ్లిద్దరిని దూరం ఈ వేడుకకు దూరంగా పెట్టినట్టు సమాచారం.
గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మ్ బాబాయ్ బాలయ్య తో అంటివి ఉంటున్నట్లు గానే ఉన్నారు. గత కొన్నేళ్లుగా బాబాయితో అబ్బాయిలకు సఖ్యత లోపించింది. ఎన్టీఆర్ బయోపిక్, అరవింద సమేత వీరరాఘవ సినిమాల వరకు వీళ్ల మధ్య మంచి అనుబంధమే ఉండేది. కానీ వైసీసీ ఎపుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి బాబాయి, అబ్బాయిల మధ్య ఉప్పు నిప్పుగా మారింది. అంతేకాదు ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు పార్టీ కష్ట సమయాల్లో తెలుగు దేశం పార్టీకి అండగా నిలబడలేదనే కారణంగా బాలయ్య వీళ్లిద్దరిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
అప్పట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..చంద్రబాబు భార్య భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన అసభ్య పదజాలంతో అసెంబ్లీ సాక్షిగా దూషించారు. అప్పట్లో పార్టీతో పాటు సామాన్య ప్రజలు ఇలాంటి విపరీత వ్యాఖ్యలను ఖండించిన వీళ్లిద్దరు మాత్రం ఈ విషయమై మౌనంగా ఉండిపోయారు. ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేష్ పెద్దగా పట్టించుకోకపోయినా.. బాలయ్య మాత్రం అబ్బాయిలపై ఇప్పటికీ కోసంగానే ఉన్నట్టు సమాచారం. అంతేకాదు బాబాయి ముందు అబ్బాయి పేర్లు ఎత్తితేనే కోప్పడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్.
మరోవైపు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ.. బాబాయ్ బాలయ్యతో కలవాలని ప్రయత్నించిన ఆయన మాత్రం వీళ్లను మాత్రం కలవడానికి ససెమిరా..ఇష్టపడటం లేదట. మొత్తంగా బాబాయ్ పాత విషయాలు అన్ని పక్కన పెట్టి పెద్ద మనసుతో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లను తన 50 ఏళ్ల వేడుకకు ఆహ్వానించి తన పెద్ద మనసు చాటుకుంటాడా ? లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter