NBK - Akhanda: అఖండ2 మూవీ నుంచి బాలయ్య అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..
NBK - Akhanda 2: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి గిరాకీ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్‌లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది ఒకటి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా వీళ్ల కలయికలో `అఖండ 2` రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య కోసం బోయపాటి శ్రీను అదిరిపోయే రోల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడట.
NBK - Akhanda2: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు చిత్ర దర్శకుడు బోయపాటి ప్రకటించారు. అఖండ 2 టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సీక్వెల్‌కు సంబంధించిన కథను పూర్తి స్థాయిలో రెడీ చేసాడట. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్ర కూడా ఉండబోతుందట. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో బాలయ్య ముసలి గెటప్‌లో అది కూడా సాధువు పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ పాత్ర స్కెచ్ రెడీ కూడా చేసాడట. త్వరలో బాలకృష్ణపై ఈ పాత్రకు సంబంధించి టెస్ట్ షూట్ కూడా చేయనున్నారట. ఈ సినిమాను పూర్తిగా సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో బోయపాటి శ్రీను 'అఖండ'ను మించి రీతిలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. ఈయన వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' భారీ హిట్‌గా నిలిచింది. కరోనా పాండమిక్ టైమ్‌లో అందరు బడా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్న సమయంలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో మిగతా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చనే భరోసా ఇచ్చింది. ఈ సినిమాలో బాలయ్య అఖండ రుద్ర సికిందర్ అఘోరా అనే టైటిల్ పాత్రతో పాటు.. మురళీ కృష్ణ అనే సామాన్య రైతు పాత్రలో నటించి మెప్పించారు. కవల సోదరులు జాతక రీత్యా ఎలా వేరు పడ్డారు.. అందులో ఒకరు అఘోరా ఎందుకు మారాడు. ఆ తర్వాత ధర్మ సంస్థాపనార్ధం మళ్లీ తన ఊరు వచ్చి ఎలా దుష్టులను అంతం చేసాడనేదే 'అఖండ' మూవీ స్టోరీ.
ఈ సినిమా క్లైమాక్స్‌లో పాప కోసం మళ్లీ వస్తానని చెప్పడంతో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని బోయపాటి శ్రీను చెప్పాడు. ఇపుడు అదే స్టోరీని బోయపాటి శ్రీను తమ టీమ్‌తో కలిసి అఖండను మించిన తీరులో రెడీ చేసారట. ఇప్పటికే కథ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టేనర్ చేస్తున్నారు. ఇందులో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాబీ దేవోల్ నటిస్తున్నారు.
ఆ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయట. ఇప్పటికే బాలయ్య డేట్స్‌తో పాటు బోయపాటి శ్రీను డేట్స్ అల్లు అరవింద్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయనే టాక్ వినిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించడం దాదాపు ఖాయం అని చెబుతున్నారు. ఇప్పటికే కథ విని ఇంప్రెస్ అయిన సంజూ ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడట. గతంలో సంజయ్ దత్.. బాలయ్య నటించిన 'లక్ష్మీ నరసింహా' సినిమాను హిందీలో 'పోలీస్ గిరి' పేరుతో రీమేక్ చేసారు. మొత్తంగా సంజయ్ దత్ రాకతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒకేసారి తెలుగు సహా హిందీ ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook