Balakrshna - Samara Simha Reddy Re Release: మార్చి 2న భారీ ఎత్తున రీ రిలీజ్ కాబోతున్న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ `సమరసింహారెడ్డి` మూవీ..

NBK - Samara Simha Reddy Re Realese: తెలుగులో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువైపోయాయి. ఈ రూట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా బాలయ్య కెరీర్లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సమరసింహారెడ్డి సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.
NBK - Samara Simha Reddy Re Realese: నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో సమరసింహారెడ్డి మూవీ ఒకటి. 25యేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా 1999 జనవరి 13న విడుదలైన ఈ మూవీ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తన పేరిట రాసుకుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇపుడీ మూవీని మార్చి 2న భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసి రీ రిలీజ్ చేస్తుంది. ఇపుడున్న 4K డాల్బీ డిజిటల్ వెర్షన్‌లో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన డబ్బులను నందమూరి బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఇవ్వనున్నట్టు సదరు నిర్మాణ సంస్ధ తెలిపింది. అప్పట్లో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సమరసింహారెడ్డి' చిత్రాన్ని చెంగల వెంకట్రావు నిర్మించారు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఇందులో అన్ని పాటలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ మూవీ అప్పట్లోనే రూ. 22 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఇక బాలయ్య సరసన ముగ్గురు భామలు నటించడం మొదలైంది ఈ సినిమాతోనే అని చెప్పాలి. అప్పటి నుంచి తన సినిమాల్లో ముగ్గురు హీరోయిన్స్ సెంటిమెంట్ రిపీట్ చేస్తూనే ఉన్నాడు బాలయ్య. సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీ ఫ్యాక్షన్ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. అప్పటికే తెలుగులో శ్రీరాములయ్య, ప్రేమించుకుందాం రా సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చాయి. కానీ పూర్తి స్థాయిలో ఈ తరహాలో తెరకెక్కిన చిత్రం సమరసింహారెడ్డి అనే చెప్పాలి.
ఈ సినిమా సక్సెస్ తర్వాత తెలుగులో చాలా మంది హీరోలు ఫ్యాక్షన్ బాట పట్టారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ చాలా మంది హీరోలు కత్తి పట్టి బాక్సాఫీస్ దగ్గర తొడగొట్టి మరి హిట్ అందుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూట్యూబ్ తో పాటు ప్రముఖ ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది వీక్షించారు. రీ రిలీజ్‌లలో చాలా సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడమే మానేసారు. అలాంటి టైమ్‌లో ఈ సినిమాను ఇపుడు పనిగట్టుకొని వచ్చి థియేటర్‌లో చూసి ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.
Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్, ధర పరంగా ఇదే బెస్ట్!
Also Read: Movies Postponed: 'వ్యూహం, శపథం' మళ్లీ వాయిదా.. నారా లోకేశ్‌కు ఆర్జీవీ అదిరిపోయే పంచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter