Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!

Difference Between Oneplus 12 And 12R: ప్రస్తుతం యువత ఎక్కువగా వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఈ OnePlus 12, OnePlus 12R స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు తికమక పడుతున్నారు. వీటి రెడిండిటో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.  

Last Updated : Feb 21, 2024, 04:18 PM IST
Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!

OnePlus 12 Vs OnePlus 12R Compare In Telugu: మార్కెట్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ఫీచర్స్‌ కలిగిన మొబైల్స్‌ను విక్రయిస్తోంది. ముఖ్యంగా గతంలో విడుదలైన OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అద్భుతంగా విక్రయిస్తోంది. దీని విక్రయాలు పెరగడంతో కంపెనీ ఇదే 12 సిరీస్‌కి సక్సెసర్‌గా OnePlus 12R పేరుతో మరో మొబైల్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే చాలా మంది ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసే క్రమంలో తికమకపడుతున్నారు. వీటిల్లో ఏ మొబైల్స్‌ బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.  

OnePlus 12 Vs OnePlus 12R:
మొదటగా OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ వివరాల్లోకి వెళితే..ఇది 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 3216 x 1440 పిక్సెల్స్‌ రెజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. దీంతో పాటు 8GB ర్యామ్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్స్‌తో పాటు 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో లభిస్తోంది. ఇక OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ విషయానికొస్తే.. 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇది  MediaTek Dimensity 8100 Max ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అలాగే ఈ మొబైల్‌ కూడా రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. 

ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ కెమెరాల విషయానికొస్తే..OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొదటి కెమెరా 50MP ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మిగితవి 32MP టెలిఫోటో లెన్స్, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ వివరాల్లోకి వెళితే..ఈ OnePlus 12 మొబైల్‌ 4500mAh బ్యాటరీ, 80W శక్తివంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక OnePlus 12R వివరాల్లోకి వెళితే..50MP ప్రధాన కెమెరాతో 8MP టెలిఫోటో లెన్స్, 2MP మాక్రో లెన్స్ కెమెరాలతో త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. దీంతో పాటు 5000mAh బ్యాటరీ, 65W వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ధర వివరాల్లోకి వెళితే..OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ 16 GB ర్యామ్, 512 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన దీని ధర రూ. 69,999తో అందుబాటులో ఉంది. OnePlus 12R మొబైల్‌ 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉన్న దీని ధర రూ.39,999తో లభిస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌ పరంగా చూస్తే.. OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ పనితీరు, కెమెరా పరంగా చాలా బాగుటుంది. ధర పరంగా చూస్తే కొంత ఖరీదైందని చెప్పొచ్చు. OnePlus 12R కూడా మంచి పనితీరును కలిగి ఉంటుంది. ధర, కెమెరా పరంగా కాస్త తక్కువగా చెప్పొచ్చు. గేమింగ్‌ పరంగా చూస్తే ఈ OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతంగా ఉంటుంది.  

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News