Neelima Shocking comments on samantha pregnancy: సమంత నాగ చైతన్య విడాకులు (ChaySam Divorce) తీసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.. సోషల్ మీడియాలో ఇద్దరు భార్య భర్తలుగా విడిపోతున్నామని, మంచి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నామని  పోస్ట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ...."ఇలాంటి కఠిన సమయంలో నాకు తోడుగా ఉన్న అందరికి ధన్యావాదాలు. కానీ.. నేను పిల్లలను కనటానికి ఇష్టంగా లేనని, వేరే వాళ్లతో అఫైర్ ఉందనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అబార్షన్ చేయించుకున్న అని , అవకాశవాదినని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. 


Aslo Read: Hyderabad Heavy Rains: ఆగకుండా కురిసిన వర్షానికి ఆగమైన రాజధాని.. Videos


విడాకులు అనేది చాలా బాధతో కూడుకున్నది. ఇలా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నాపై దాడి చేయటం చాలా దారుణం. నా వ్యక్తితం పై తప్పుడు ప్రచారాలు చేయటం మీకు తగదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను.. మీరు అనుకునే విధంగా మాత్రం ఎన్నడూ చేయను .. నన్ను ఒంటరిగా వదిలేయండి.. అంటూ సమంత పోస్ట్ (Samantha Post) చేసిన సంగతి మనకు తెలిసిందే. 


సమంత- నాగచైతన్య విడాకులపై శాకుంతలం సినిమా నిర్మాత.. డైరెక్టర్ గుణ శేఖర్ (Director Guna shekhar) కూతురు నీలిమ గుణ (Neelima Guna) షాకింగ్ నిజాలు బయటపెట్టారు.  ఇటీవల ఒక జాతీయా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో... 


Aslo Read: MAA Elections 2021: మా ఎన్నికలు రేపే, ఏర్పాట్లు పూర్తి


"నేను మా నాన్న శాకుంతలం (Shakunthalam Movie) సినిమా కోసం సమంతను సంప్రదించే సమయానికి ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉంది, కొత్త సినిమాలు చేసే ఆలోచనలేదు కాదు కానీ శాకుంతలం కథ నచ్చటంతో ఆమె కొన్ని షరతులు పెట్టి మరీ సినిమా చేస్తానని చెప్పింది. షూటింగ్ త్వరగా పూర్తి  అవ్వాలని, ఆగస్టు నెల వరకు పూర్తయితే కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని, పిల్లలను కనటమే నాకు ముఖ్యమని సమంత తెలిపారు". కానీ ఇంతలో ఇలా చై -సామ్ విడాకులు తీసుకోవటం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని"  నీలిమ గుణ వెల్లడించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి