Samantha Emotional Post: అబార్షన్, అఫైర్లపై స్పందించిన సమంత..ఎప్పటికలా చేయనంటూ పోస్ట్

తనపై జరుగుతున్న ఆబార్షన్, అఫైర్ ల ప్రచారం గురించి సమంత స్పందించింది. తనపై పుకాట్లు శృష్టించి, ఇలా వ్యక్తిగంతంగా దాడి చేయటం సమంజసం కాదని ఎమోషనల్ పోస్ట్ చేసింది సమంత. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2021, 08:50 PM IST
  • విడాకుల తరువాత సమంత ఎమోషనల్ పోస్ట్
  • అబార్షన్, అఫైర్స్ పై నోరు విప్పిన సమంత
  • కొన్ని రోజులు వదిలేయండి అంటూ ఎమోషనల్ పోస్ట్
Samantha Emotional Post: అబార్షన్, అఫైర్లపై స్పందించిన సమంత..ఎప్పటికలా చేయనంటూ పోస్ట్

Samantha Emotional Post: సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.. సోషల్ మీడియాలో ఇద్దరు భార్య భర్తలుగా విడిపోతున్నామని, మంచి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నామని  పోస్ట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. 

"పిల్లలను కనటానికి ఇష్టపడటం లేదని, రెండు సార్లు అబార్షన్ చేయించుకుందని మరియు వేరే వాళ్లతో అఫైర్ పెట్టుకుందని" సోషల్ మీడియాలో సమంతపై  చాలా రకాల పుకార్లు వస్తున్నాయి. పిల్లల విషయంలో నాగ్ కుటుంబం నచ్చచెప్పటానికి ప్రయత్నించారని.. వినని పక్షంలో నాగ చైతన్య విడాకులు ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. 

Also Read: RBI Good News:ఆర్‌బీఐ కీలక ప్రకటన.. త్వరలో ప్రారంభంకానున్న ఆఫ్‌లైన్‌ డిజిటల్ సేవలు

తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. "ఇలాంటి కఠిన సమయంలో నాకు తోడుగా ఉన్న అందరికి ధన్యావాదాలు. కానీ.. నేను పిల్లలను కనటానికి ఇష్టంగా లేనని, వేరే వాళ్లతో అఫైర్ ఉందనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అబార్షన్ చేయించుకున్న అని , అవకాశవాదినని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. 

నా విషయంలో విడాకులు అనేది చాలా పెద్ద విషయం మరియు చాలా బాధతో కూడుకున్నది. ఇలా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నాపై దాడి చేయటం చాలా దారుణం.  నా వ్యక్తితం పై తప్పుడు ప్రచారాలు చేయటం మీకు తగదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను.. మీరు అనుకునే విధంగా మాత్రం ఎన్నడూ చేయను .. నన్ను ఒంటరిగా వదిలేయండి.. అంటూ పోస్ట్ చేసింది. 

Also Read: Konda Polam Movie Review: వైష్ణ‌వ్‌తేజ్ నటించిన 'కొండ పొలం' సినిమా రివ్యూ

ఈ పోస్ట్ చూసిన సమంత అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతూ.. హార్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలపై త్పపాక స్పంచించాలి సామ్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు నీపై బురద జల్లున వారు ఇపుడేం చేస్తారో చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News