కేన్సర్ నుంచి కోలుకున్న తరువాత సంజయ్ దత్ లుక్ మార్చాడు. తన కొత్త డ్యాషింగ్ లుక్ వల్ల సంజయ్ ( Sanjay Dutt ) మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. పైగా వయస్సు వెనక్కి తగ్గినట్టు... రివర్స్ గేర్ పట్టినట్టు అనిపిస్తోంది సంజయ్ దత్ లుక్ చూస్తోంటే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read |  జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ గురించి ఆసక్తికరమైన విషయాలు


బాలీవుడ్ లో సంజయ్ దత్ ను సంజూ బాబా, రాకీ అని కూడా పిలుస్తుంటారు. ఈ పేర్లకు తగ్గట్టుగానే నిత్యం కొత్త లుక్ ట్రై చేస్తూ నిత్యం కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తాడు సంజయ్ దత్. అయితే లుక్ విషయంలోనే కాదు..ప్రాణాంతక కేన్సర్ పై విజయం సాధించి ఎంతో మందికి  ప్రేరణగా నిలిచారు ఆయన.



Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback


సంజయ్ దత్ ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్ చాప్టర్ 2లో ( KGF Chapter 2) కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అధీరా అనే అతి భయంకరమైన విలన్ పాత్రలో కనిపించనున్నాడు. దీని కోసం సంజయ్ పూర్తిగా కొత్త లుక్ ట్రై చేశారు. ఒక వైపు స్టైలిష్, మరో వైపు డేంజరస్ గా కనిపించే విధంగా సంజయ్ లుక్ డిజైన్ చేశారట మేకర్స్. మరి సినిమాలో అధీరా ఎలాంటి మేనరిజం చూపిస్తాడో తెలుసుకోవాలి అటే సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR