హాలీవుడ్ దిగ్గజ నటుడు సీన్ కానరీ మరణంతో ఒక శకం ముగిసింది. సర్ సీన్ కానరీ 7 దశాబద్దాల తన సినీ ప్రస్తానంలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. అందులో ఆయనకు బాగా పేరు సంపాదించి పెట్టింది మాత్రం జేమ్స్ బాండ్ 007 పాత్రలే.
సీన్ కానరీ స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ లో నివసించేవారు.
నటుడిగా మారే ముందు పాలు అమ్మేవారు.
చిన్న పాత్రతో రంగ స్థల నటుడిగా తెరంగేట్రం చేశాడు సీన్ కానరీ. లారీ డ్రైవర్, స్విమ్మింగ్ పూల్ లైఫ్ గార్డ్ వంటి పాత్రలు కూడా చేశారు.
హాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన మైఖేల్ కేన్- కానరీ మధ్య మంచి స్నేహం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో The Man Who Would Be Killed, A Brigde Too Far వంటి సినిమాలు చేశారు.
1962లో తొలి సారిగా బాండ్ పాత్రలో కనిపించారు . Dr.No, 007 చిత్రాలతో మంచి గుర్తింపు సాధించారు.
సీన్ కానరీ 17వ ఏట నుంచే జుట్టు రాలే సమస్య ఉండేది. అప్పటి నుంచే ఆయన నకిలీ జుట్టు ధరించేవారు.