Niharika Konidela: భర్తకు నిహారిక లిప్‌లాక్.. రెచ్చిపోయిన నెటిజన్లు!
Niharika Konidela lip lock photo with husband chaitanya. మరోసారి మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం.. భర్త చైతన్య జొన్నలగడ్డకు నిహారిక లిప్‌లాక్ ఇచ్చిన ఫోటో ఒకటి బయటకు రావడమే.
Netizens brutully trolls Niharika Konidela over lip lock photo with husband chaitanya: నిహారిక కొణిదెల.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఢీ జూనియర్ 1, ఢీ జూనియర్ 2 షోలతో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నవ్వు, చలాకీ మాటలతో అందరిని ఆకట్టుకున్నారు. నాగశౌర్య హీరోగా వచ్చిన 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. ఆపై 'సూర్యకాంతం' సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.
సినిమాలలో హీరోయిన్‌గా అంత సక్సెస్ కాకపోయినా.. నిర్మాతగా మాత్రం నిహారిక కొణిదెల ముందుకెళ్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగు వెబ్ సిరీస్ 'ముద్దపప్పు ఆవకాయ్'ను నిర్మించారు. ఈ సిరీస్ యూట్యూబ్‌లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు చేయకపోయినా.. నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇటీవలే నిర్మాతగా మరో ప్రాజెక్ట్ మొదలెట్టారు.
ఇటీవల బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన ఘటన అందర్నీ షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. సమయానికి మించి పబ్‌ను రన్ చేస్తుండడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో చాలా మంది ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. అందులో మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఉన్నారు. ఫ్రెండ్ బర్త్ డే కోసమే నిహారిక వెళ్లిందని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చినా.. ఆమె పేరు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
మరోసారి మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం.. భర్త చైతన్య జొన్నలగడ్డకు నిహారిక లిప్‌లాక్ ఇచ్చిన ఫోటో ఒకటి బయటకు రావడమే. 'విడిపోని బంధం' అంటూ నిహా భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. దాంతో నెటిజన్లు నిహారికని ఆడుకుంటున్నారు. ఇంత బోల్డ్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. తన వివాహబంధంపై వచ్చిన పుకార్లకు చెక్ పెట్టేందుకే నిహా ఇలా చేసిందని మద్దుతుగా నిలుస్తున్నారు. అయితే ఈ ఫోటోను నిహారిక షేర్ చేయకపోవడం విశేషం.
Also Read: Virat Kohli: అరుదైన రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. తొలి బ్యాటర్‌గా నిలిచేందుకు..!
Also Read: RRR OTT: సినీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.