Virat Kohli: అరుదైన రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. తొలి బ్యాటర్‌గా నిలిచేందుకు..!

RCB vs GT, IPL 2022: Virat Kohli Record. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రెకార్డుపై కన్నేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 05:00 PM IST
  • అరుదైన రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ
  • తొలి బ్యాటర్‌గా నిలిచేందుకు
  • అత్యధిక పరుగులు చేసింది విరాట్ కోహ్లీనే
Virat Kohli: అరుదైన రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. తొలి బ్యాటర్‌గా నిలిచేందుకు..!

RCB Batter Virat Kohli eye on massive record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌లో నేడు రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. గురువారం ముంబైలోని వాంఖడే మైదానంలో రాత్రి 7.30కు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో గుజరాత్‌తో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు 10 విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్.. ఐపీఎల్ 2022లో తమ జైత్రయాత్రను కొనసాగించాలనుకుంటుంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 

అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రెకార్డుపై కన్నేశాడు. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు 220 మ్యాచులు ఆడిన కోహ్లీ.. 6,519 పరుగులు చేశాడు. ఇప్పటికే బెంగళూరు తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా ఉన్న కోహ్లీ.. 7,000 పరుగుల మైలురాయికి ఇంకా 481 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ ఫామ్ చూస్తే.. ఈ సీజన్లో ఆ రికార్డు అసాధ్యం. ఐపీఎల్ 2023లో ఈ రికార్డు సాధించే అవకాశం ఉంది. విరాట్ 481 రన్స్ చేస్తే.. బెంగళూరు తరపున 7,000 పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలుస్తాడు. అలానే ఓ జట్టు తరఫున 7,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా రికార్డులోకి ఎక్కుతాడు. 

ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసింది విరాట్ కోహ్లీనే. 220 మ్యాచులలో 6,519 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ 6205 రన్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (5877), ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5876), మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (5528) టాప్-5లో ఉన్నారు. బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 5162 పరుగులతో 5 వేల క్లబ్‌లో ఉన్నాడు.  

Also Read: చివరి బంతికి లక్నో ఊహించని విజయం.. హద్దులు దాటి సంబరాలు చేసుకున్న గౌతమ్ గంభీర్ (వీడియో)!

Also Read: RRR OTT: సినీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News