Varalakshmi Sarathkumar: మామూలు ప్రజలకే కాదు సినిమా వారికి కూడా ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. అందుకే సినిమా ముహూర్తం దగ్గర నుంచి చిత్రంలో నటించే నటి నటుల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎవరన్నా హీరో లేదా హీరోయిన్ కి వరసగా ఫ్లాపులు వస్తే వారిని ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తూ ఉంటారు.. ఒకవేళ హిట్లు వస్తే గోల్డెన్ లెగ్ అని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇవన్నీ ఒక రకమైతే..కొంతమంది నటులు సినిమాలో చనిపోతే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అని నమ్మేవారు కూడా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అచ్యుత్.. ఎక్కువగా అలాంటి పాత్రలే చేసేవారు. విచిత్రంగా ఆయన అలా చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ వరలక్ష్మి శరత్ కుమార్ విషయంలో కూడా జరుగుతుంది. ప్రస్తుతం తమిళ సినిమాల కన్నా తెలుగు సినిమాలతో బిజీగా ఉండి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమధ్య ఈ నటి నటించిన సినిమాలు అన్నీ దాదాపు మంచి విజయం సాధిస్తున్నాయి. అయితే విచిత్రంగా ఈ హీరోయిన్ చనిపోయే పాత్రలు చేసే సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.


వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ కాకపోయినా కొన్నిసార్లు వాళ్ళను డామినేట్ చేసే స్థాయిలో స్క్రీన్ ప్రెజెన్స్ చూపిస్తోంది. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ సంచలనంగా నిలిచిన ‘హనుమాన్’లో తేజ సజ్జ అక్క గా తన పెర్ఫార్మన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రీ క్లైమాక్స్ కి ముందు విలన్ వినయ్ చేతిలో హత్యకు గురై మంచి ఎమోషన్ అందించింది ఈ క్యారెక్టర్. ఇక ఈ సినిమా సక్సెస్ నుంచే వరలక్ష్మి శరత్ కుమార్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


అదేమిటి అంటే.. ఈ హీరోయిన్స్ చనిపోతే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని. ముఖ్యంగా ఎవరన్నా హత్య చేస్తే ఇక ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అని అంటున్నారు సోషల్ మీడియా యూజర్స్. కాగా వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ‘వీరసింహారెడ్డి’లోనూ వరలక్ష్మికి కన్నుమూసే పాత్రే దక్కింది. బాలకృష్ణ చెల్లెలిగా ముందు నెగటివ్ షేడ్స్ తో మొదలై ఆపై తప్పు తెలుసుకుని చివరికి ఆత్మహత్య చేసుకునే పాత్రలో కనిపించింది. ఆ సినిమా గత సంవత్సరం సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయ్యింది ‌


ఇక అంతకు ముందు రవితేజ ‘క్రాక్’లో సముతిరఖని సర్వస్వంగా పక్కనే ఉంటూ చివరికి అతని వల్లే హతమయ్యే జయమ్మగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అవ్వడం విశేషం. 


మొత్తానికి మూడు సంక్రాంతిలకు వచ్చిన ఈ మూడు సినిమాలలో కూడా హత్య లేదా ఆత్మహత్యకు గురయ్యే పాత్రలు చేసింది. నటన పరంగా అన్నింటికి ప్లస్ గా నిలవడమే కాక ఆ సినిమాలతో సూపర్ సక్సెస్ కూడా దక్కించుకుంది. గత కొన్నేళ్లుగా వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో తనదైన ముద్ర బలంగా వేస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ నటికి ఎలాంటి పాత్రలు వస్తాయో వేచి చూడాలి.


Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు 


Also Read: Upcoming Best OLED TVs 2024: Samsung, LGకి షాక్‌..డెడ్‌ చీప్‌ ధరకే AI ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి Panasonic OLED టీవీలు..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter