Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు 

Rat dead body in Food order: ఆకలవడంతో తిందామని శాఖాహారం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే మాంసాహారం వచ్చింది. ఆర్డర్‌ చేసిన ఆహారంలో చచ్చిన ఎలుక కనిపించడంతో ఆ యువకుడు ఖంగుతిన్నాడు. దెబ్బకు జ్వరమొచ్చి మూడు రోజులు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 04:36 PM IST
Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు 

Rat found in Food Delivery: కొత్త ప్రదేశాలు సందర్శనకు వెళ్లినప్పుడు వచ్చే ఇబ్బంది ఒక్కటే భోజనం. తెలియని ప్రాంతంలో ఎక్కడ భోజనం బాగుంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితే ఓ యువకుడికి ఏర్పడింది. ఇక ఏం చేయాలో తెలియక ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశాడు. ఆకలి మీద ఉన్న ఆ యువకుడు ఆవురావుమంటూ ఆరగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఎలుక కనిపించింది. అంతే ముందే శాఖాహారి అయిన ఆ యువకుడు తినే ఆహారంలో మాంసాహారం కనిపించడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురై మూడు రోజుల పాటు ఆస్పత్రి పాలయ్యాడు. ఇంత జరిగినా కూడా హోటల్‌ యాజమాన్యం కానీ.. ఫుడ్‌ డెలివరీ యాప్‌ నిర్వాహకులు గానీ స్పందించలేదు. ఈ దారుణ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ఆ యువకుడు పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వార్త వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రాజీవ్‌ శుక్లా ఈనెల 8వ తేదీన ముంబైకి వెళ్లాడు. రాత్రిపూట ఆకలేసి ఆన్‌లైన్‌లో ఆహారం కోసం అన్వేషించాడు. శాఖాహారి కావడంతో బార్బీక్యూ నేషన్‌ అనే హోటల్‌ నుంచి శాఖాహార భోజనం ఆర్డర్‌ చేశాడు. అయితే తినే సమయంలో ఆహారంలో ఎలుక కళేబరం కనిపించింది. ఇది చూసి అవాక్కైన రాజీవ్ వాంతులు చేసుకున్నాడు. ఇది అతడి శరీరం తట్టుకోలేకపోయింది. వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. ఫలితంగా మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ ఆహారం ముంబైలోని వర్లీలో ఉన్న బార్బీక్యూ నేషన్‌ ఔట్‌లెట్‌ నుంచి వచ్చింది.

 

ఈ విషయాన్నంతా రాజీవ్‌ శుక్లా 'ఎక్స్‌' వేదికగా పంచుకున్నాడు. తన పరిస్థితి మొత్తం వివరించాడు. తన పోస్టులో ఫుడ్‌ ఆర్డర్‌ రసీదు, డెలివరీ కవర్‌, ఆహార పదార్థం వంటి ఫొటోలను కూడా పంచుకున్నాడు. ఈ సంఘటనపై హోటల్‌ నిర్వాహకులు స్పందించారు. 'జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం' అంటూ బార్బీక్యూ నేషన్‌ తెలిపింది. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని శుక్లా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ సంఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటల్‌ నిర్వాహకులు శుభ్రత పాటించకుండా ఆహారం తయారు చేస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదని సమాచారం. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు 15 రోజులకొకసారి హోటళ్లలో తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read SpiceJet: విమానం బాత్రూమ్‌లో చిక్కుకున్న ప్రయాణికుడు.. గంటపాటు నరకయాతన

Also Read: Realme 12 Pro: శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Realme 12 Pro మొబైల్‌..దీని కెమెరాపై ఏ యాపిల్‌ ఫోన్ కెమెరా పనికి రాదు!
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News