Netizens Trolling Allu Arjun for not sharing condolences to Krishnam raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులందరూ కృష్ణంరాజు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇంత జరుగుతుంటే అల్లు అర్జున్ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ వేయక  పోవడమే కాక తనకు పుష్ప సినిమాకు గాను సైమా అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆ అవార్డుతో కలిసిన ఫోటో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన  ఒకసారి ఈ అవార్డు అందుకోవడమే ఒక కల అనుకుంటే నాకు రెండోసారి కూడా వచ్చింది, ఇది నిజంగా అదృష్టమే అని చెబుతూ పుష్పలోని తగ్గేదేలే అనే సిగ్నేచర్ మూమెంట్ చేసి దాన్ని షేర్ చేశారు. దీంతో నెటిజన్లు కొంతమంది అల్లు అర్జున్ చేసిన పని మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.


సినీ పరిశ్రమ అంతా కృష్ణంరాజు మృతి నేపథ్యంలో బాధ పడుతుంటే సంతాపం వ్యక్తం చేయకపోవడం ఏ మాత్రం కరెక్ట్ గా లేదని ఆయనను టార్గెట్ చేసి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు కృష్ణంరాజు నివాసానికి వెళ్లి మరీ ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తుంటే అల్లు అర్జున్ జాడ ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్గా మారింది.


అయితే సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగిన క్రమంలో ఎట్టకేలకు అల్లు అర్జున్ స్పందించారు. కృష్ణంరాజు గారి ఆకస్మిక మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని, చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అపారమైనవని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు & అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్న ఆయన కృష్ణం రాజు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
Also Read: Krishnam Raju Death Live Updates: కృష్ణంరాజు కన్నుమూత.. రేపు అంత్యక్రియలు -లైవ్ అప్డేట్స్


Also Read: Krishnam Raju Death: కృష్ణంరాజు మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వక్తం చేసిన సినీ ప్రముఖులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి