RRR New Release date: మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్... RRR కొత్త విడుదల తేదీ ప్రకటన..
RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్`. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
RRR Movie Release Date Update news: మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఆర్ఆర్ఆర్ టీమ్. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR Movie). అలియాభట్, అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం..కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కొత్త విడుదల తేదీని (RRR New Release Date) ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాను మార్చి 25న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రోమోలు, టీజర్స్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ (NTR) కొమురం భీంగా, రామ్ చరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజుగా నటించారు. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి కీలకపాత్రల్లో నటించారు. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా..కరోనా థర్డ్ వేవ్ (Covid Third Wave in India) కారణంగా బ్రేక్ పడింది. తాజాగా చిత్రయూనిట్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
Also Read: Salaar Movie: డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ ..రెండు పార్ట్‌లుగా ఉండనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook