Salaar Movie: బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన డార్లింగ్ ప్రభాస్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటోంది. ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ సలార్ ఎన్ని భాగాల్లో ఉండనుందనే ప్రశ్న కొత్తగా విన్పిస్తోంది. ఆ వివరాలు చూద్దాం. (Prabhas upcoming movie, kgf director prashant neil's salaar movie to be in two parts)
తెలుగు ప్రజలకు డార్లింగ్‌గా, ఉత్తరాదికి బాహుబలిగా సుపరిచితమైన ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఏకంగా 6 పాన్ ఇండియా సినిమాలున్నాయి. హెక్టిక్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ సినిమాలు చాలావరకూ షూటింగ్ దశలోనే ఉన్నాయి. ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ ఇండియా సినిమాల విలువ దాదాపు రెండు వేల కోట్లు. ఆశ్యర్యంగా ఉన్నా..నిజమే ఇది. ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్, ప్రోజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇందులో షూటింగ్ పూర్తి చేసుకుని ముందుగా విడుదలకు సిద్ధంగా ఉన్నది రాధేశ్యామ్. కరోనా థర్డ్‌వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది.
ఇక ఆదిపురుష్, సలార్ సినిమాలు షుటింగ్ దశలో ఉన్నాయి. కేజీఎఫ్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావల్సి ఉన్నా..కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ప్రశాంత్ నీల్‌ను స్టార్ దర్శకుడిగా చేసింది కేజీఎఫ్ సినిమా. ఈ సినిమా రెండవ భాగం త్వరలో విడుదల కానుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్..ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న సలార్ సినిమా కూడా రెండు భాగాల్లో ఉంటుందని తెలుస్తోంది. సలార్ రెండు భాగాల విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఏ విధమైన ప్రకటన లేకపోయినా..వార్త మాత్రం హల్చల్ చేస్తోంది.
ఎందుకంటే గతంలో బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాలు ఒక సినిమాగా ప్రారంభమై..మధ్యలో రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే కోవలో సలార్ కూడా ఉంటుందనేది సమాచారం. డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఈ లాజిక్‌నే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సలార్‌లోని యాక్షిన్ సన్నివేశాల్ని ప్రశాంత్ నీల్ రీషూట్ చేస్తున్నారు. రెండు భాగాలు తెరకెక్కుతున్నందునే..రీషూట్ జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. యాక్షన్ సన్నివేశాల్ని సైతం టెక్నాలజీ సహాయంతో హాలీవుడ్ స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. చిత్ర యూనిట్ నుంచి ఏ విధమైన అధికారిక ప్రకటన లేకపోయినా..అప్పుడే మొదటి భాగం అక్టోబర్ నెలలోనూ, రెండవ భాగం 2023 వేసవిలోనూ విడుదలవుతుందంటూ షెడ్యూల్ కూడా ట్రోల్ అవుతోంది.
Also read: Ameesha Patel latest pics: గోవాలో హాఫ్ న్యూడ్ ఫోటోలతో రెచ్చిపోతున్న అమీషా పటేల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.