New Tension For Mahesh Babu- Trivikram Movie: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందాల్సిన సినిమాకి ఇంకా బాలారిష్టాలు తొలిగేట్లు కనిపించడం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు 28వ సినిమా రూపొందాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల మీద చినబాబు, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి, ఆ విషయం మీద నిర్మాత నాగవంశీ కూడా అధికారిక ప్రకటన చేశారు.. ఇక మొదటి షెడ్యూల్ పూర్తయి రెండో షెడ్యూల్ కు సిద్ధమవుతున్న సమయంలో మహేష్ బాబు తల్లి మరణించడం ఆ తర్వాత ఆ బాధ నుంచి కోలుకునేందుకు ఆయన లండన్ పయనమవ్వడం, అలా వెళ్లి లండన్ నుంచి వచ్చి రాగానే తండ్రి చనిపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే విషయం మీద అనేక సందిగ్ధాలు ఉన్నాయి.


దానికి తోడు ఈ కథ నచ్చలేదు కాబట్టి మరోసారి కథ మార్చాలని మహేష్ కోరినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే త్రివిక్రమ్ కథ కూడా మార్చారని, పూర్తిగా కొత్త కథతో సెట్స్ మీదకు వెళతారని ప్రచారం జరుగుతోండగా ఇప్పుడు సినిమాకు మరో కొత్త సమస్య వచ్చి పడినట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైంది, కానీ మహేష్ బాబు షెడ్యూల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందని త్రివిక్రమ్ వేసిన కొత్త షెడ్యూల్ కోసం ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ షెడ్యూల్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఇక ప్రస్తుతానికైతే మహేష్ బాబు దుబాయ్ లో ఉన్నారు. మౌంటెన్ డ్యూ యాడ్ షూట్ కోసం ఆయన దుబాయ్ వెళ్లడంతో త్రివిక్రమ్ కూడా అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. వేరు వేరు హోటల్లలో హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా బస చేశారని తెలుస్తోంది.


వీరంతా కలిసి ఒకే రూమ్ లో ఈ మ్యూజిక్ కి సంబంధించిన సి ట్టింగ్స్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే పూజా హెగ్డే ఎఫెక్ట్ తో మరోసారి ఈ సినిమా షెడ్యూల్ క్యాన్సిల్ అయింది అన్న వార్త తెలుసుకున్న మహేష్ అభిమానులు ఈ సినిమాకి ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఏంటి అనే విషయం మీద టెన్షన్ పడుతున్నారు. చూడాలి మరి ఎప్పటికి ఈ సినిమా పూర్తి స్థాయిలో సెట్స్ మీదకు వెళ్లనుంది అనేది. 


Also Read: Amala Paul Hot Photos: ఎద అందాలతో రచ్చ రేపిన అమలా పాల్..మరీ ఈ రేంజ్ లోనా?


Also Read: Prudhvi Raj: 30 ఇయర్స్ పృధ్వీరాజ్ సూసైడ్ అటెంప్ట్.. అసలు విషయం బయట పెట్టాడుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook