Tunisha Sharma Suicide Case: తునీషా శర్మ కేసులో ట్విస్ట్.. తల్లితో విభేదాలు.. బయటపెట్టిన షీజన్ సోదరి!
New Twist in Tunisha Sharma Suicide Case: తునీషా శర్మ ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది, లవ్ జీహాద్ వ్యవహారంలో క్లారిటీ లభించడమే కాక మరో విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
New Twist in Tunisha Sharma Suicide Case: తునీషా శర్మ ఆత్మహత్య కేసులో అనేక ట్విస్ట్‌లు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా, షీజన్ మానసిక పరిస్థితి సరిగా లేదని, తదుపరి విషయాలపై విలేకరుల సమావేశం నిర్వహిస్తానని షీజన్ తరపు న్యాయవాది ప్రకటించారు. సోమవారం నాడు షీజన్ సోదరీమణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు బయట పెట్టారు. తునీషా ఆత్మహత్యకు ముందు వీరిద్దరూ విడిపోయినా వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారని వారు వెల్లడించారు.
తునీషా శర్మ తనకు అక్కలాంటిదని షీజన్ సోదరి ఫలక్ నాజ్ అన్నారు, మాకు రక్తసంబంధం లేకపోయినా, మా మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని అన్నారు. తునీషా మృతి కేసులో షీజన్ పేరు రావడంతో ఆమె సోదరీమణులు ఫలక్ నాజ్, షఫక్ నాజ్, తల్లి కహక్షన్ ఖాన్, నిందితుడు షీజన్ తరపు న్యాయవాది శైలేంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో, తునీషాకు తన కుటుంబంతో మంచి సంబంధాలు లేవని షీజాన్ తరపు వారు ఆరోపిస్తున్నారు.
అయితే తునీషా శర్మ తల్లి షీజన్‌పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. షీజన్ సోదరి మాట్లాడుతూ ఆమె హిజాబ్ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది, అయితే అది లవ్ జీహాద్ కాదని, వారిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు అని చెప్పుకొచ్చారు. ఇక హిజాబ్ ధరించడం, ఉర్దూ మాట్లాడడం అన్నీ షూటింగ్ లో భాగమని వారు పేర్కొన్నారు. పవన్ శర్మ మతమార్పిడి ఆరోపణలు చేయడం తప్పని ఆ హిజాబ్ ఛానల్ కోసం వేసుకుందని, మా వైపు నుండి ఇలాంటివి ఏమీ చేయలేదని పేర్కొన్నారు.
షీజన్ సోదరి ఇంకా మాట్లాడుతూ, మేము తునీషా పుట్టినరోజును ప్లాన్ చేసామని, దాని గురించి ఆమె తల్లికి కూడా తెలుసని అన్నారు. తునీషా తల్లి ఆమెకు పదే పదే ఫోన్ చేసేదని తునీషాకు నటించడం ఇష్టం లేదని ట్రావెలింగ్ చేయాలనీ అనుకుంది కానీ ఆమె తల్లి బలవంతం వల్లనే ఆమె నటిస్తోందని వారు పేర్కొన్నారు.
తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్యకు గురైందా?
ప్రముఖ టీవీ నటి తునీషా శర్మ ఈ సీరియల్ సెట్స్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఒక రకంగా ఇది బాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు షీజన్ ఖాన్‌ను నిందితుడిగా పరిగణించి అదుపులోకి తీసుకున్నా అందుకు తగ్గ ఆధారాలు సంపాదించే పనిలో పడ్డారు పోలీసులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook