Pawan Kalyan vs Allu Arjun: ఇటు మెగాస్టార్ చిరంజీవి.. అటు అల్లు అరవింద్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు మెగా కుటుంబం,  అల్లు కుటుంబం కలిసిపోయి జీవించేవి.. అయితే ఈ మధ్యకాలంలో వారి వారసులు హీరోలుగా మారిన తర్వాత అసలు కుట్రలు బయటపడుతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ గొప్పతనాన్ని పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోవడం, పవన్ కళ్యాణ్ అభివృద్ధికి అల్లు అర్జున్ సహాయపడకపోవడం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే అల్లు కుటుంబం మెగా కుటుంబం మధ్య గొడవలు తారస్థాయికి చేరాయని చెప్పాలి . అయితే ఈ విషయాలు ఏ రోజు కూడా బయటపడలేదు కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి.. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయో అప్పుడు మెగా వర్సెస్ అల్లుగా ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు .ఆ సమయంలో సినీ సెలబ్రిటీలందరూ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికారు కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయలేదు. పైగా మేనమామ, దగ్గరి బంధువు అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేయకుండా ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి సపోర్టు చేయడంతో అసలు కథ అక్కడే మొదలైంది. చాలామంది అల్లు అర్జున్ ని విమర్శిస్తూ కామెంట్లు చేశారు.. నాగబాబు కూడా అల్లు అర్జున్ పరాయి వాడు అన్నట్టు పోస్ట్ కూడా చేశాడు. దీంతో అల్లు , మెగా అభిమానుల మధ్య గొడవలు కూడా జరిగాయి.. అయితే తాజాగా ఈ గొడవలు అన్నింటిపై కూడా మెగా వారసురాలు నిహారిక క్లారిటీ  ఇచ్చింది. 


నిహారిక మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారివి.. అల్లు అర్జున్ ఎవరికీ సపోర్ట్ చేస్తారు అన్నది ఆయన వ్యక్తిగత విషయం.. దానిపై మెగా ఫ్యామిలీలో ఎప్పుడూ కూడా ఎటువంటి వ్యతిరేకత లేదు.. ఆయన ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వారికే సపోర్ట్ చేస్తారు.. ఫలానా వారికే సపోర్ట్ చేయాలని ఎవరు రుద్దలేరు కదా.. ఎవరి వ్యక్తిగత నిర్ణయం వారిది .. అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం వల్ల మా ఫ్యామిలీలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ నిహారిక క్లారిటీ ఇచ్చింది.. మొత్తానికి అయితే నిహారిక చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి నిహారిక ఇచ్చిన క్లారిటీతోనైనా అల్లు , మెగా అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయేమో చూడాలి.


Also Read: Revanth vs Tollywood: నా మాటలకే స్పందన ఇవ్వరా? సినీ పరిశ్రమపై మళ్లీ రేవంత్‌ రెడ్డి అసంతృప్తి


Also Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter