Niharika Konidela: నేను చేయాలనుకున్నవన్నీ చేసేశా.. నిహారిక పోస్ట్ వైరల్
Niharika Konidela Enjoys at Bali నెట్టింట్లో నిహారిక ఇప్పుడు సందడి చేస్తోంది. బాలీలో తన ఫ్రెండ్స్ అందరితో కలిసి దుమ్ములేపేస్తోంది. వెకేషన్లో నిహారిక ఇప్పుడు చేసిన కామెంట్లు, వేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాను సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
Niharika Konidela Enjoys at Bali: నిహారిక కొణిదెల హీరోయిన్ గా లాంచ్ అవ్వాలని అనేక ప్రయత్నాలు చేసి లాంచ్ అయింది. కానీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ మాత్రం అవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో తండ్రి బాటలో నిర్మాతగా మారి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ, వెబ్ సిరీస్ లో చేస్తూ ఒకటి అర ప్రాజెక్టులు కూడా నిర్మిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో ఆమె తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోబోతోంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఈ విషయం మీద అటు చైతన్యం నుంచి కానీ ఇటు మెగా క్యాంపు నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేకపోయినా దాదాపుగా వారిద్దరు విడిపోవడం అనేది ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడం లేదు. ఇక తాజాగా డెడ్ పిక్సెల్స్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందు కూర్చున్న నిహారిక ఆ సక్సెస్ ని తన స్నేహితురాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తోంది
అత్యంత విలాసవంతమైన బాలి దీవుల్లో ఆమె వెకేషన్ కి వెళ్ళింది ఇక అక్కడ ప్రకృతిలో లీనమై ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ తన అనుభవాలను ఆమె షేర్ చేసుకుంది తాను గత కొద్ది రోజుల నుంచి అనుభవిస్తున్న దాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఆమె రాసుకొచ్చింది. తాను ఇప్పుడు చేస్తున్న అన్ని తనకు సంతోషాన్ని కలిగిస్తున్నాయని, అనుకున్నవన్నీ చేస్తున్నానని, చిన్న చిన్న విషయాలైనా అవన్నీ తనకు చాలా పెద్ద ఆనందం తీసుకొస్తున్నాయని చెప్పుకొచ్చింది.
Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!
"ఈ ప్రదేశం నన్ను నేను మళ్ళీ వెతుక్కోవడానికి సహాయపడింది నేనేం చేయగలను మాకు తెలియ చెప్పింది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటూ ఆమె రాస్కొచ్చింది తన జీవితంలో ఉన్న అందరూ వ్యక్తులు తనను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని అర్థం వచ్చేలా రాసుకున్న ఆమె అలాంటి వాళ్ళు తన జీవితంలో ఉన్నందుకు లక్కీ అని కూడా పేర్కొంది ఇక బాలి దీవులకు థాంక్స్ చెప్పిన ఆమె ఆ దీవులే తనకు నిజమైన అమ్మగా ఒక గురువుగా ఉన్నాయని చెబుతూ మరికొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది".
Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook