Niharika Konidela Chef Mantra: రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మెగా కుటుంబానికి ఒక స్థాయి ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి ఆయన కంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులుగా మెగా కుటుంబం నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిట్ ఫ్లాప్ ల సంగతి పక్కన పెడితే ఇప్పటిదాకా మెగా హీరోలా కారణంగా మెగా కుటుంబానికి ఎలాంటి పరువు నష్టం కలగలేదు. కానీ మెగా కుటుంబం నుంచి వచ్చిన మెగా ప్రిన్సెస్ నిహారిక కొనిదెల మాత్రం మెగా కుటుంబానికి మాయని మచ్చలాగా ఏర్పడింది అని కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. 


మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదల షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ ను మొదలుపెట్టి ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆమె కెరియర్లో పెద్ద చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు లేకపోవడంతో ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ టీవీ షోస్ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టింది. 


ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ ఆహా ప్లాట్ ఫామ్ లో చెఫ్ మంత్ర అనే ఒక కుకింగ్ షో ని ప్రారంభించింది నిహారిక. పేరుకి కుకింగ్ షో అయినప్పటికీ ఈ షో కంటెంట్ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా షో లో ఉన్న వల్గారిటీ, డబల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి.


ఆఖరికి మెగా అభిమానులకి కూడా ఈ షో నచ్చకపోగా వారే నిహారిక కొనిదెల పై మండిపడుతున్నారు. ఇలాంటి షోలు చేస్తూ నిహారిక మెగా కుటుంబానికి పరువు నష్టం కలిగిస్తోంది అని అభిమానులు సైతం వాపోతున్నారు. ఒకవైపు మెగా కుటుంబం నుంచి వచ్చిన మెగా హీరోలు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని ముందుకు వెళుతుండగా మెగా కుటుంబం కెమెరా ముందుకి వచ్చిన మొదటి అమ్మాయి అయిన నిహారిక మాత్రం మెగాస్టార్ పేరు చెడగొడుతోంది అని ఫాన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు.


Also Read: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..


Also Read: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook