Niharika reacts on allu arjun incident: పుష్ప2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫిస్ మీద అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మూవీ కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ఈ మూవీలోని షేకవాత్ పేరు వివాదంగా మారింది. ఇక పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన తొక్కిసలాట దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో.. రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ తొక్కిసలాట ఘటనలో మొత్తంగా 18 మందిపై పోలీసులు కేసుల్ని నమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఈ కేసులో ఏ11 గా చేర్చారు. అనేక నాటకీయా పరిణామాల నేపథ్యంలో అల్లుఅర్జున్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న విషయం తెలిసిందే.


ఇటీవల అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రి వెళ్లి మరీ శ్రీతేజ్ ను పరామర్శించారు. శ్రీతేజ్ ను చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. ఈ ఘటనపై తాజాగా.. మెగా డాటర్ నిహరిక స్పందించారు.  నిహారిక తాజాగా.. తన మూవీ.. మద్రాస్ కారన్ మూవీ ప్రమోషన్ లలో భాగంగా మాట్లాడారు.


సంధ్యథియేటర్ ఘటన చాలా బాధించిందన్నారు. చక్కగా ఫ్యామిలీతో కలిసి మూవీ ఎంజాయ్ చేద్దామని వచ్చి.. ఇలా మహిళ చనిపొవడం బాధకరమన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయని, ఎవరు అనుకొరని అన్నారు. 


ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యాడని చెప్పారు. ఇప్పుడిప్పుడే.. బన్నీ కొలుకుంటున్నాడని చెప్పారు. అభిమానులు ఎంతో మంది ఇలాంటి పరిస్థితుల్లో బన్నీకి అండగా నిలిచారన్నారు. అయితే.. తన ఫ్యామిలీలోని హీరోల గురించి  నిహారిక పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  బన్నీ నుంచి సినిమాలకు , మరొ సినిమాకు ఏదో ఒక డిఫరెంట్ లుక్ ఉండేలా చూసుకుంటాడని..  తాను.. అది నేర్చుకున్నట్లు చెప్పారు.


Read more:  Kannappa: మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. కన్నప్ప పోస్టర్‌పై దుమారం.. మ్యాటర్ ఏంటంటే..?


తనకు ఏదైన మూవీస్ కు సంబంధించిన కథల విషయంలో ఇబ్బంది అన్పిస్తే.. తన సోదరుడు వరుణ్ తేజ్ తో మాట్లాడతానని, ఇంటర్వ్యూ  స్కిల్స్ రామ్ చరణ్ ను చూసి నేర్చుకున్నట్లు కూడా మెగా డాటర్ నిహరిక చెప్పుకొచ్చారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter