Kannappa: మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. కన్నప్ప పోస్టర్‌పై దుమారం.. మ్యాటర్ ఏంటంటే..?

Manchu family controversy: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఇటీవల తరచుగా వివాదాలలో ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల మంచు విష్ణు కన్నప్ప మూవీలోని కాజల్ లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 8, 2025, 02:36 PM IST
  • కన్నప్ప పోస్టర్ పై రచ్చ..
  • మార్చాలని వెల్లువెత్తిన డిమాండ్ లు..
Kannappa: మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. కన్నప్ప పోస్టర్‌పై దుమారం.. మ్యాటర్ ఏంటంటే..?

Kannappa movie Parvathi devi poster controversy: మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు మాత్రం తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఆయన కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. అదే విధంగా మంచు మోహన్ బాబు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం వంటి నాటకీయ పరిణామలు ఇండస్ట్రీలోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా మోహన్ బాబు.. జల్ పల్లి వద్ద కౌంటర్ తప్పి.. రిపోర్టర్ మీద మైక్ లోగోతో దాడికి పాల్పడటం కూడా రచ్చకు దారితీసింది. ప్రస్తుతం మోహన్ బాబు మీద మూడు కేసులు నమోదైనట్లు తెలుస్తొంది.

అయితే.. మోహన్ బాబు ఇటీవల తనకు రిపోర్టర్ మీద దాడి ఘటనలో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇటీవల జల్ పల్లి వద్ద.. మంచు విష్ణు సెక్యురిటీ సిబ్బంది అడవి పందుల్ని వేటాడిన వీడియోలు కూడా వార్తలలో నిలిచాయి. ఇదికూడా వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు  డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో కన్నప్పను నిర్మిస్తున్న విషయం  తెలిసిందే.

దీనిలో ఇటీవల కాజల్ పార్వతిదేవీలాగా పోస్టర్ ను మేకర్స్  విడుదల చేశారు. అయితే.. ఈ పోస్టర్ పైన ప్రస్తుతం వివాదం రాజుకుందని తెలుస్తొంది. కాజల్ తెల్లటి పట్టు చీరలో, హిమాలయ పర్వతాల మీద.. ఒక బండరాయి మీద అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెనుక మహా కాళి అవతారం పొగమంచుతో డిజైన్ చేసినట్లు తెలుస్తొంది.

Read more:  Sreeleela: సైఫ్ అలీఖాన్ కొడుకుతో డేటింగ్‌లో శ్రీలీల..?.. ఇద్దరు సీక్రెట్‌గా ఏంచేస్తున్నారో తెలుసా..?

అయితే.. ఈ పోస్టర్ లో పార్వతీ దేవీలా ఉన్న కజల్ కు కనీసం కుంకుమ లేదని..అదే విధంగా పార్వతీ అమ్మవారిని అదేదో.. తమకు నచ్చినట్లు మోడ్రన్ పార్వతిలా డిజైన్ చేశారని.. ఇది తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కూడా కొంత మంది నెటిజన్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. వెంటనే ఆ లుక్ ను మార్చాలని కూడా అనేక మంది సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారంట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News