Nikhi Sidharth Remuneration దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ఇండస్ట్రీ జనాలకు ఎక్కువగా వంటబడుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లంతా కూడా చేసేది. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ పెంచేస్తారు. ఎంత సంపాదించుకోగలరో అంత సంపాదించేసుకుని సైడ్ అయిపోతారు. హీరోయిన్ల టైం ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఒకప్పుడు దశాబ్దాల పాటు హీరోయిన్లుగా రాణించారు. కానీ ఇప్పుడు మహా అంటే రెండు మూడేళ్ల కంటే ఎక్కువగా వారికి క్రేజ్ ఉండటం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ హీరోల పరిస్థితి అలా కాదు. వయసు అరవై దాటినా కూడా క్రేజ్, డిమాండ్ తగ్గదు. బాలయ్య, వెంకీ, చిరు, నాగ్ ఇలా ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. వారికి అభిమానులు నీరజనాలు పడుతూనే ఉన్నారు. అయితే హీరోలు మాత్రం ఆచితూచి తమ రెమ్యూనరేషన్ పెంచుకుంటారు. ఎందుకంటే వీరిది సుధీర్ఘమైన జర్నీ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన టైంకు రెమ్యూనరేషన్లు పెంచుకుంటారు.


ఇప్పుడు నిఖిల్ మంచి ఫాంలో ఉన్నాడు. కార్తికేయ 2 హిట్టుతో దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో నిఖిల్ కూడా ప్యాన్ ఇండియా స్టార్లలో చేరిపోయాడు. అయితే ఆ స్థాయిని కాపాడుకుంటాడా? లేదా? అన్నది చూడాలి. కార్తికేయ 2 వంద కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఔరా అనిపించింది. ఇప్పుడు ఈ సక్సెస్‌ను నిఖిల్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ దెబ్బతో తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడట.


మొదట్లో ఒక్కో సినిమాకు 4,5 కోట్లు తీసుకునే నిఖిల్ ఇప్పుడు మాత్రం 8 కోట్లు అడుగుతున్నాడట. నిఖిల్ అడిగింది ఇవ్వడానికి కూడా నిర్మాతలు సై అంటున్నారట. మొత్తానికి నిఖిల్‌ తనకు వచ్చిన సక్సెస్‌ను నిలబెట్టుకోవడం పెద్ద బాధ్యతే. నిఖిల్ 18 పేజీస్ సినిమాతో ఎలాంటి సక్సెస్ కొడతాడో చూడాలి.


Also Read : RGV Siri Stazie : రాళ్లతో కొట్టి చంపేసేవారు, వెలేసేవారు.. అలా బతికిపోయారు.. ఆర్జీవీపై బీవీఎస్ రవి కామెంట్స్


Also Read : Pawan Kalyan Martial Arts : పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్.. మంచో చెడో కానీ సంతోషంగా ఉందన్న మంచు లక్ష్మీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook