Pawan Kalyan Martial Arts : పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్.. మంచో చెడో కానీ సంతోషంగా ఉందన్న మంచు లక్ష్మీ

Pawan Kalyan Martial Arts పవన్ కళ్యాణ్ తన హరి హర వీరమల్లు సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇరవై ఏళ్ల తరువాత మళ్లి ఇలా ప్రాక్టీస్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2022, 12:23 PM IST
  • హరి హర వీరమల్లు షూట్ అప్డేట్
  • మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లో పవన్ కళ్యాణ్‌
  • మంచు లక్ష్మీతో పోల్చుతూ ట్రోల్స్
Pawan Kalyan Martial Arts : పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్.. మంచో చెడో కానీ సంతోషంగా ఉందన్న మంచు లక్ష్మీ

Pawan Kalyan Martial Arts పవన్ కళ్యాణ్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్‌ మీద రాజకీయంగా ఎన్ని ట్రోల్స్ చేస్తారో అందరికీ తెలిసిందే. జన సైనికులకు, వైసీపీ శ్రేణులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యుద్దం నడుస్తూనే ఉంటుంది. తాజాగా హరి హర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోన్న స్టిల్‌ను షేర్ చేశారు. దాని వైసీపీ నాయకులు కూడా స్పందించారు. దీన్ని మార్షల్ ఆర్ట్స్ అంటారా? ఏంటా పిచ్చి చేష్టలు అంటూ దారుణంగా తిట్టేశారు.

అయితే ఇప్పుడు వైసీపీ శ్రేణుల ట్రోలింగ్‌లో మంచు లక్ష్మీ వచ్చింది. చివరకు నువ్ మంచు లక్ష్మీని కాపీ కొట్టి స్టిల్స్ పెడుతున్నావ్ అంటూ మీమ్స్ వేశారు. ఇందులో మంచు లక్ష్మీ కలరి పట్టు నేర్చుకుంటున్నప్పుడు దిగిన స్టిల్స్‌ను పెట్టి పవన్ కళ్యాణ్‌ను ట్రోల్ చేశారు. అయితే దీనిపై మంచు లక్ష్మీ స్పందించింది. మంచో చెడో ఏదో ఒకటి గానీ.. పవన్ కళ్యాణ్ గారి పక్కన నా ఫోటో పెట్టడం నాకు సంతోషంగా అనిపిస్తోందంటూ పవన్ కళ్యాణ్‌ మీదున్న ప్రేమను చెప్పకనే చెప్పేసింది.

 

కానీ మంచు లక్ష్మీ వేసిన ఈ ట్వీట్ మీద పవర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. అలా పోల్చుకోవడానికి, ఆయన పక్కన ఉండటానికి యోగ్యత అనేది ఉండాలి అంటూ కౌంటర్లు వేస్తున్నారు.  పవన్ కళ్యాణ్‌ను కావాలనే ట్రోల్ చేస్తున్నావా? అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హరి హర వీరమల్లు సెట్స్ మీదుండగా.. మొన్న సుజిత్‌ సినిమాను ప్రారంభించాడు. నిన్న హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక రేపు ఇంకేదైనా కొత్త సినిమాను ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

Also Read : Shraddha Das New Pics : బుల్లి గౌనులో శ్రద్దా దాస్.. క్లియర్‌గా ఓపెన్ చేసిన హాట్ బ్యూటీ.. పిక్స్ వైరల్

Also Read : Vijay Devarakonda Kushi : సమంత వల్ల మరింత ఆలస్యం.. విజయ్‌ 'ఖుషీ' ఇప్పట్లో లేనట్టే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News