టిక్‌టాక్ ( TikTok), షేర్ఇట్ ( ShareIt) వంటి మొత్తం 59 చైనా యాప్స్ ( Chinese Apps Banned In India ) ను బ్యాన్ చేసిన తరువాత సోషల్ మీడియాలో నెటిజెన్స్ వాటి గురించే చర్చలు జరుపుతున్నారు.  అయితే టాలీవుడ్ నటులు నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha ), సందీప్ కిషన్ ( Sandeep Kishan )  ట్విట్టర్ చాట్  మాత్రం వైరల్ అవుతోంది. Also Read : ప్రాణం తీసిన tiktok పాపులారిటీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 టాలీవుడ్ ( Tollywood )  నటులు నిఖిల్, సందీఫ్ కిషన్ టిక్‌టాక్ లాంటి 59 యాప్స్ బ్యాన్ గురించి సోమవారం రోజు ట్విట్టర్ లో చాటింగ్ చేశారు. ఈ చాట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.  ముందుగా  నిఖిల్ తన ట్వీట్ లో  "టిక్‌టాక్ ను  ( TikTok Ban ) బ్యాన్ చేయకుండా ఉండాల్సింది. మనది ప్రజాస్వామ్య దేశం కదా " అని రాశాడు.  





 


ఈ ట్వీట్ కు నెటిజెన్లు వ్యగ్వంగా సమాధానం ఇస్తున్న సమయంలోనే మరో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ రిప్లై ఇచ్చాడు.  'నేను కూడా అదే అంటున్నాను నిఖిల్. టిక్‌టాక్ లాంటి యాప్స్ ను  బ్యాన్ చేయడం వల్ల చాలా మంది నిరుద్యోగులవుతారు. కానీ దేశ ప్రయోజనాల కోసం ఇది తప్పదు' అని ట్వీట్ చేశాడు సందీప్. Also Read : Goats Quarantined : పశువుల కాపరికి కరోనా…50 మేకలు క్వారంటైన్




 


 దానికి వెంటనే నిఖిల్ రిప్లై ఇస్తూ 'నేను కూడా అదే అంటున్నాను . ఇక్కడ వ్యగ్యంగా  కామెంట్ చేస్తున్న వారికి కూడా నేను చెప్పేది ఒక్కటే.. బ్యాన్ చైనా ప్రోడక్ట్స్ అనే #BanChineseProducts  హ్యాష్ ట్యాగ్ ను పుష్ చేయండి' అని రాశాడు. 




 


అదే సమయంలో  సందీప్ కిషన్ తన రిప్లై లో  "  టిక్‌టాక్ సంస్థ విలువ 75 బిలియన్ డాలర్లు.  అది చైనాలో అత్యధికంగా ట్యాక్సు చెల్లిస్తోన్న సంస్థ. అంటే మనం ఇచ్చే డబ్బు మన దేశంపై దాడి చేయడానికి వారు వాడుతున్నారు. దాంతో పాటు మన వ్యక్తిగత సమాచారాన్ని వారు దుర్వినియోగపరుస్తున్నారు;  అని తెలిపాడు.  Also Read : First vaccine: భారత్ లో తొలివ్యాక్సీన్ తీసుకునేది ఎవరు ?



 


నిఖిల్ సందీప్ ల మధ్య సాగిన ట్విట్టర్ చాట్‌ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. చాలా మంది చైనా యాప్స్ నిషేధాన్ని  మద్దతు ఇస్తూ భారతీయ యాప్స్ వినియోగించాలి అని కోరారు.